Karimnagar: బీఆర్ఎస్ కార్యకర్తపై బీజేపీ నేతల దాడిపరామర్శించిన ఎమ్మెల్యే

Karimnagar: కిసాన్ నగర్‌లో తీవ్రంగా గాయపడిన బీఆర్ఎస్ కార్యకర్త శ్రీకాంత్‌ను మాజీ మంత్రి, ఎమ్మెల్యే కమలాకర్ బీజేపీ దాడుల సంస్కృతిపై తీవ్రంగా మండిపడ్డారు.

Update: 2026-08-11 03:12 GMT

Karimnagar: బీఆర్ఎస్ కార్యకర్తపై బీజేపీ నేతల దాడిపరామర్శించిన ఎమ్మెల్యే

Karimnagar: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కిసాన్ నగర్‌లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త శ్రీకాంత్‌పై జరిగిన దాడి తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీకాంత్‌ను మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించి, ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం ఆసుపత్రి వద్ద మీడియాతో మాట్లాడారు.

​దాడుల సంస్కృతిని తెచ్చింది బీజేపీనే: గంగుల కమలాకర్

​మేయర్ పీఠం ఇస్తే దాడులా? కరీంనగర్ ప్రజలు బీజేపీకి మేయర్ పదవిని కట్టబెడితే, వారు నగరంలో 'దాడుల సంస్కృతి'కి తెరలేపారని గంగుల కమలాకర్ మండిపడ్డారు. ​గతంలో బీఆర్ఎస్ రెండు పర్యాయాలు మేయర్ పీఠం అధిరోహించినా, అలాగే కాంగ్రెస్ హయాంలోనూ కరీంనగర్‌లో ఎప్పుడూ ఇలాంటి దాడులు జరగలేదని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైన సుపరిపాలన అందించామని గుర్తుచేశారు.

​కక్షసాధింపు చర్యలు:

బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలలో తిరుగుతున్నాడనే అక్కసుతోనే బీజేపీ కార్పొరేటర్ సోమిడి వేణు తన అనుచరులతో కలిసి రోడ్డుపై శ్రీకాంత్‌పై ఇనుప రాడ్లతో పాశవికంగా దాడి చేశారని ఆరోపించారు. శ్రీకాంత్ చనిపోయాడని భావించి వారు అక్కడి నుంచి పరారయ్యారని తెలిపారు.

​కేంద్ర మంత్రి బండి సంజయ్ కి ప్రశ్నలు...పోలీసుల తీరుపై ప్రశంసలు. కరీంనగర్ ప్రజలకు ఏం సంకేతాలు ఇస్తున్నారు? కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు పార్టీలో ఏం జరుగుతుందో అర్థమవుతుందా?" అని గంగుల ప్రశ్నించారు. ​గతంలో తన కార్యాలయంపై దాడి జరిగినప్పుడే హోం మంత్రి హోదాలో ఉన్నవారు స్పందించి చర్యలు తీసుకుని ఉంటే, నేడు ఇలాంటి దాడులు పునరావృతం కాకపోయేవని అన్నారు.

​కిసాన్ నగర్‌లో తాము రోడ్లు వేయిస్తే, బీజేపీ నాయకులు రాడ్లతో ప్రజలపై దాడులు చేస్తున్నారని విమర్శించారు. గెలిచి మూడు నెలలు కూడా కాకముందే దాడులకు తెరలేపారని ధ్వజమెత్తారు.

​పోలీసుల పనితీరు:

పోలీసులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. రౌడీషీటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఏ పార్టీవారైనా సరే చట్టం ముందు శిక్షించాల్సిందేనని స్పష్టం చేశారు. అభివృద్ధి వర్సెస్ విధ్వంసం,​కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కరీంనగర్‌ను రూ.1,650 కోట్లతో అత్యద్భుతంగా, సురక్షితమైన 'స్మార్ట్ సిటీ'గా తీర్చిదిద్దామని తెలిపారు.

​కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ నగరానికి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తారనుకుంటే, కేవలం దాడుల సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ​కరీంనగర్ ఎప్పుడూ శాంతియుతంగా, సేఫ్ సిటీగా ఉండాలని ఆకాంక్షించారు.

​బీఆర్ఎస్ శ్రేణులకు పూర్తి భరోసా, ​బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ తన కార్యకర్తలకు అండగా ఉంటుందని భెరోసా కల్పించారు. కార్యకర్తలపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ, రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త్వరలోనే కరీంనగర్‌కు రానున్నట్లు తెలిపారు.

​రెండేళ్లలో ఈ ప్రభుత్వం తొలగిపోతుంది, ప్రతి ఒక్కరి లెక్కలు తేలుస్తాము. మేము కూడా ప్రతిదాడులు చేయము కానీ చట్టం ముందే దోషులను నిలబెడతాము" అని హెచ్చరించారు. ​ఈ ఘటనపై కేంద్ర మంత్రి స్పందించి, హింసకు పాల్పడిన వారిని పార్టీ నుండి సస్పెండ్ చేసి తమ నిజాయితీని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమం లో ఎమ్మెల్యే గంగుల తో పాటు బిఆర్ఎస్ కార్పొరేటర్లు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Tags:    

Similar News