Sultanabad: 'హర్ ఘర్ తిరంగా'సుల్తానాబాద్‌లో భారీ త్రివర్ణ పతాక ప్రదర్శన!
Sultanabad: 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా సుల్తానాబాద్‌లో 200 మీటర్ల జాతీయ జెండాతో 2,000 మంది విద్యార్థుల భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు.
Sultanabad: 'హర్ ఘర్ తిరంగా'సుల్తానాబాద్‌లో భారీ త్రివర్ణ పతాక ప్రదర్శన!
Sultanabad: 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని 'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమంలో భాగంగా సుల్తానాబాద్ మండల కేంద్రంలో మంగళవారం భారీ తిరంగా ర్యాలీని వైభవంగా నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షుడు కందుల శ్రీనివాస్, హర్ ఘర్ తిరంగా కన్వీనర్ ఉషణ అన్వేష్ నేతృత్వంలో జరిగిన ఈ ర్యాలీలో వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన దాదాపు 2,000 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
విద్యార్థులు 200 మీటర్ల పొడవైన భారీ త్రివర్ణ పతాకాన్ని చేతబూని, దేశభక్తి నినాదాలతో పట్టణ ప్రధాన వీధుల గుండా ప్రదర్శన చేపట్టారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రే సంజీవరెడ్డి, రాష్ట్ర నాయకుడు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి, ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు మీసా అర్జున్ రావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ జాతీయ జెండా భారత్ సార్వభౌమత్వానికి, ఐక్యతకు, త్యాగాలకు ప్రతీక అని, ప్రతి ఒక్కరిలో దేశభక్తి పెంపొందించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని అన్నారు. దేశ సమగ్రతను కాపాడే బాధ్యత యువతపైనే ఉందన్నారు.
కందుల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తి స్ఫూర్తిని చాటాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సౌదరి మహేందర్ యాదవ్, కాసాగోని నిర్మల, పలువురు మండల నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.