Pithapuram: కత్తులగూడెంలో పోలీసుల పల్లెనిద్ర.. ప్రజా అవగాహన సదస్సు!
Pithapuram: కాకినాడ జిల్లా పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కత్తులగూడెంలో పోలీసులు పల్లెనిద్ర, ప్రజా అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
Pithapuram: కత్తులగూడెంలో పోలీసుల పల్లెనిద్ర.. ప్రజా అవగాహన సదస్సు!
పిఠాపురం: ఈ రోజు పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కత్తులగూడెంలో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొని గ్రామ ప్రజలకు క్రింది అంశాలపై అవగాహన కల్పించారు. రాబోయే స్థానిక సంస్థల (పంచాయతీ, మున్సిపాలిటీ, మండల పరిషత్) ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించాలని సూచించారు.
దొంగతనాల నివారణ, అనుమానాస్పద వ్యక్తుల సమాచారం వెంటనే పోలీసులకు అందించాలని కోరారు. గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించి, వాటి వినియోగం, రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నివారణ మరియు గుర్తింపు, మహిళల భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పోలీసులకు సహకరిస్తామని హామీ ఇచ్చారు.