Ramapuram: గ్రామ సమగ్రాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తా: సావిత్రి!

అన్నమయ్య జిల్లా: రామాపురం మండలం చిట్లూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా గాలివీడు సావిత్రి పోటీకి సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, చిన్నమండెం జడ్పీటీసీ డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి, యువ నాయకులు మౌర్యా రెడ్డి తో పాటు మండల,గ్రామ టీడీపీ నాయకులకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా గాలివీడు సావిత్రి మాట్లాడుతూ.. గ్రామ ప్రజల ఆశీస్సులతో సర్పంచ్‌గా విజయం సాధిస్తే చిట్లూరు గ్రామ సమగ్రాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. గ్రామంలో నెలకొన్న ప్రతి సమస్యను గుర్తించి, కూటమి నాయకుల సమన్వయంతో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.

గ్రామంలో మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రజలకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చారు. గ్రామ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న తనను ప్రజలు ఆశీర్వదించి, సర్పంచ్‌గా గెలిపించాలని గాలివీడు సావిత్రి విజ్ఞప్తి చేశారు.

Tags: