Punganur: పుంగనూరులో వైసీపీకి భారీ షాక్.. టీడీపీలోకి సీనియర్ నేతలు!

పుంగనూరు: చౌడేపల్లి మండలానికి చెందిన సీనియర్ నాయకులు , మాజీ ఎంపీపీ రెడ్డి ప్రకాశ్ , మాజీ సర్పంచ్ భరత్ వరుణ్ కుటుంబ సభ్యులు తో కలిసి వైఎస్సార్‌సీపీని వీడి తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ ఇన్‌చార్జ్ మధుసూదన్ నాయుడు నాయకత్వం, ప్రజల కోసం ఆయన చేస్తున్న కృషికి ఆకర్షితులై ఈ చేరిక జరిగినట్లు వారు తెలిపారు.

ఈ సందర్భంగా మధుసూదన్ నాయుడు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా టీడీపీలోకి ఆహ్వానించారు. రాబోయే రోజుల్లో పుంగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

మాజీ ఎంపీపీ రెడ్డి ప్రకాశ్ , మాజీ సర్పంచ్ భరత్ వరుణ్, అరుణ్ కుమార్ కుటుంబ సభ్యులు తో పాటు వారి అనుచరుడు మోహన్ నాయుడు టీడీపీలో చేరడంతో మండలంలో పార్టీకి మరింత బలం చేకూరిందని టీడీపీ మధుసూదన్ నాయుడు పేర్కొన్నారు.

Tags: