Rayachoty: రాయచోటిలో కేవీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభం
Rayachoty: రాయచోటి బ్రాహ్మణ వీధిలో డా. అబూబకర్ సిద్దిక్, డా. రుబీనా దంపతుల నూతన కేవీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని టీడీపీ నేత డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి ప్రారంభించారు.
Rayachoty: రాయచోటిలో కేవీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభం
రాయచోటి: రాయచోటి పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో డా. అబూబకర్ సిద్దిక్, డా. రుబీనా దంపతుల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన కె.వి. హాస్పిటల్ సర్జికల్ అండ్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని రాయచోటి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాయచోటి పట్టణ ప్రజలకు అధునాతన వైద్య సదుపాయాలతో కూడిన మరో ఆసుపత్రి అందుబాటులోకి రావడం ఎంతో సంతోషకరమన్నారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలను అందుబాటు ధరల్లో అందించేందుకు వైద్యులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు.
ప్రజల ఆరోగ్య సంరక్షణలో వైద్యుల పాత్ర అత్యంత కీలకమైనదని పేర్కొన్న డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి, ఆధునిక వైద్య పరికరాలు, వివిధ వైద్య విభాగాలు, నిపుణులైన వైద్యులతో కె.వి. హాస్పిటల్ రాయచోటి పరిసర ప్రాంత ప్రజలకు విశేష సేవలు అందించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా నూతన ఆసుపత్రి ఏర్పాటు చేసిన డా. అబూబకర్ సిద్దిక్, డా. రుబీనా దంపతులకు అభినందనలు తెలియజేస్తూ, ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందిస్తూ కె.వి. హాస్పిటల్ మరింత అభివృద్ధి చెందాలని కోరారు.