Rayachoti: రాయచోటిలో కె.వి. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం
Rayachoti: రాయచోటి బ్రాహ్మణ వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన కె.వి. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను టీడీపీ నేత డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి ప్రారంభించారు.
Rayachoti: రాయచోటిలో కె.వి. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం
రాయచోటి: అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో, రవితేజ హాస్పిటల్ ఎదురుగా డా. అబూబకర్ సిద్దిక్, డా. రుబీనా దంపతుల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన కె.వి. హాస్పిటల్ సర్జికల్ అండ్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని రాయచోటి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాయచోటి పట్టణ ప్రజలకు అధునాతన వైద్య సదుపాయాలతో కూడిన మరో ఆసుపత్రి అందుబాటులోకి రావడం ఎంతో సంతోషకరమన్నారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలను అందుబాటు ధరల్లో అందించేందుకు వైద్యులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు.
ప్రజల ఆరోగ్య సంరక్షణలో వైద్యుల పాత్ర అత్యంత కీలకమైనదని పేర్కొన్న డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి, ఆధునిక వైద్య పరికరాలు, వివిధ వైద్య విభాగాలు, నిపుణులైన వైద్యులతో కె.వి. హాస్పిటల్ రాయచోటి పరిసర ప్రాంత ప్రజలకు విశేష సేవలు అందించాలని ఆకాంక్షించారు.
నూతన ఆసుపత్రి ఏర్పాటు చేసిన డా. అబూబకర్ సిద్దిక్, డా. రుబీనా దంపతులకు అభినందనలు తెలియజేస్తూ, ప్రజలకు విశ్వసనీయమైన, నాణ్యమైన వైద్యసేవలు అందిస్తూ కె.వి. హాస్పిటల్ మరింత అభివృద్ధి చెందాలని కోరారు.