Rayachoti: రాయచోటి వీరభద్ర స్వామికి ఘనంగా పల్లకి సేవ
Rayachoti: అన్నమయ్య జిల్లా రాయచోటిలో శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామికి ఘనంగా పల్లకి సేవ. పాల్గొన్న కర్ణాటక, స్థానిక భక్తులు.
Rayachoti: రాయచోటి వీరభద్ర స్వామికి ఘనంగా పల్లకి సేవ
రాయచోటి: అన్నమయ్య జిల్లా రాయచోటి లో వెలసిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానం నందు సోమవారం పల్లకి సేవ పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
వేద మంత్రాలు డప్పు వాయిధ్యాలతో వీరబద్ర మాడ వీధుల్లో భక్తులు భక్తి శ్రద్దలతో పల్లకిని ఊరేగించారు. స్థానిక భక్తులతో పాటు కర్ణాటక రాష్ట్రం నుండి విచ్చేసిన భక్తులు ఈ పూజా కార్యక్రమం లో పాల్గొన్నారు.
వారికి దేవస్థానం అర్చక స్వాములు అర్చనలు చేసి తీర్థ ప్రసాదాలు అందించారని దేవస్థానం చైర్మన్ తిరుమల మనోజ్ కుమార్ గారు మరియు దేవస్థాన కార్యనిర్వాహన అధికారి శ్రీ డివి రమణారెడ్డి గారు తెలియజేశారు