Rayachoti: ఎస్ఐఆర్ హియరింగ్‌లో వెసులుబాటు కల్పించండి: వినతి
Rayachoti: ఎస్ఐఆర్ హియరింగ్‌కు వ్యక్తిగతంగా హాజరుకాలేని వారికి ప్రత్యేక వెసులుబాటు కల్పించాలని సహారా వెల్ఫేర్ సొసైటీ, జమియత్ ఉలేమా-ఎ-హింద్ నేతలు ఈఆర్వోకు వినతిపత్రం సమర్పించారు.
Rayachoti: ఎస్ఐఆర్ హియరింగ్‌లో వెసులుబాటు కల్పించండి: వినతి
రాయచోటి: ఎస్ఐఆర్ ప్రక్రియలో నోటీసులు అందుకున్న ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వ్యక్తిగతంగా హియరింగ్‌కు హాజరుకాలేని వారికి తగిన వెసులుబాటు కల్పించాలని సహారా వెల్ఫేర్ సొసైటీ సభ్యులు షేక్ ఆఫ్తాబ్ జమియత్ ఉలుమా ఏ హింద్,మౌలానా సలీం అన్నమయ్య జిల్లా రాయచోటి ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్‌ను కోరారు.
ఎస్ఐఆర్ నోటీసులు అందుకున్న వారిలో కొంతమంది విద్య వైద్యం ఉపాధి వంటి కారణాలతో ఇతర రాష్ట్రాలు విదేశాల్లో ఉన్నారని తెలిపారు. వృద్ధులు, వికలాంగులు, గర్భిణీ స్త్రీలు, అనారోగ్యంతో ఇంటి వద్ద లేదా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారు కూడా ఉన్నారని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సంబంధిత వ్యక్తి వ్యక్తిగతంగా హియరింగ్‌కు హాజరు కాలేకపోయిన కారణంగా వారి ఓటు హక్కుకు ఎలాంటి నష్టం కలగకూడదని కుటుంబ సభ్యులు లేదా బంధువులు తగిన ధృవీకరణ పత్రాలతో వారి తరపున హాజరై అవసరమైన పత్రాలను సమర్పించేందుకు అవకాశం కల్పించాలని కోరారు.
ఎన్యూమరేషన్ ఫారాలు నింపడం నింపేటప్పుడు కుటుంబ సభ్యుల్లో ఎవరైనా నింపి సంతకం చేసి ఇవ్వచ్చు అన్నారు. నోటీసు తీసుకునే సమయంలో కుటుంబ సభ్యులు ఎవరైనా తీసుకోవచ్చన్నారు. కేవలం నోటీసులకు సమాధానం ఇచ్చే సమయంలో నోటీసు జారీ అయిన వ్యక్తి తానే స్వయంగా అధికారుల ముందు హాజర అవ్వాలని నిబంధన పై ప్రజలు ఆందోళన గురవుతున్నారన్నారు. సరిహద్దు రాష్ట్రాలైన పశ్చిమబెంగాల్ బీహార్ లాంటి రాష్ట్రంలో లేని ఆంక్షలు ఆంధ్ర ప్రదేశ్లో పెట్టడం సమంజసం కాదని తెలిపారు. ఓటరు జాబితాలో పేర్లు చిరునామా, ఇతర వివరాల్లో తప్పులు ఉన్న ప్రజలు ఫారం -8 ద్వారా సవరణలకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు.
ప్రజలకు అందుబాటులో ఉన్న ఫారం-8 దరఖాస్తులను స్వీకరించి, నిబంధనల ప్రకారం పరిశీలించి అర్హత ఉన్న సందర్భాల్లో అవసరమైన సవరణలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.ఎస్ఐఆర్ ప్రక్రియ పారదర్శకంగా, ప్రజలకు అనుకూలంగా కొనసాగేందుకు సంబంధిత అధికారులు పై రెండు అంశాలను సానుకూలంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో సహారా వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు సయ్యద్ అమీర్ అలీ గౌరవ అధ్యక్షులు రియాజుద్దీన్ గౌరవ సలహాదారుడు నిజాంఖాన్ సొసైటీ సభ్యులు జిలాన్ భాష ,మస్తాన్, ఖాదర్ బాషా జమీయత్ ఉలమా ఏ హింద్ కార్యదర్శి అర్షద్ సభ్యులు జాబీర్,షబ్బీర్ ముస్లిం ఐక్యవేదిక అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు మాసుమ్ వలి తదితరులు పాల్గొన్నారు.