Rayachoti: హోస్టళ్లలో విద్యార్థి సంఘాల నిషేధ జీవోను రద్దు చేయాలి!

Rayachoti: ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థి సంఘాల ప్రవేశంపై నిషేధం విధిస్తూ ఇచ్చిన జి.ఓ ను ఉపసంహరించుకోవాలని రాయచోటిలో ఏఐఎస్ఏ (AISA) డిమాండ్.

Update: 2026-08-09 10:58 GMT

Rayachoti: హోస్టళ్లలో విద్యార్థి సంఘాల నిషేధ జీవోను రద్దు చేయాలి!

Rayachoti: అన్నమయ్య జిల్లా రాయచోటి లో ప్రభుత్వ SC, ST, BC సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థి సంఘాల ప్రవేశాలు, సమావేశాలను కూటమి ప్రభుత్వం నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఏఐఎస్ఏ (AISA) డిమాండ్ చేశారు. హాస్టళ్లలో విద్యార్థులు ఎదుర్కొంటున్న భోజనం, తాగునీరు, పారిశుధ్యం, మౌలిక వసతులు, విద్యా సౌకర్యాల సమస్యలను తెలుసుకుని అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో విద్యార్థి సంఘాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.

విద్యార్థి సంఘాల ప్రవేశాలను నిషేధించడం వల్ల విద్యార్థుల సమస్యలు బయటకు రాకుండా పోయే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే నిషేధాన్ని ఎత్తివేసి, వసతి గృహాల్లో విద్యార్థి సంఘాల ప్రవేశాలు, సమావేశాలకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యార్థుల హక్కుల కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ప్రసాద్, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News