Rayachoti: పెద్దకాలవపల్లెలో వీరబల్లి సుబ్బయ్య మృతి పట్ల సంతాపం

Rayachoti: పాముకాటుతో మృతి చెందిన వీరబల్లి సుబ్బయ్య భౌతికకాయానికి నివాళులర్పించిన రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు.

Update: 2026-08-08 13:41 GMT

Rayachoti: పెద్దకాలవపల్లెలో వీరబల్లి సుబ్బయ్య మృతి పట్ల సంతాపం

రాయచోటి: రాయచోటి మండలం ఎగువ అబ్బవరం పరిధిలోని పెద్దకాలవపల్లెకు చెందిన వీరబల్లి సుబ్బయ్య గారు పాము కాటుకు గురై మృతి చెందిన విషయం తెలుసుకున్న రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు వారి స్వగృహానికి వెళ్లి భౌతికకాయానికి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా సుబ్బయ్య గారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ, ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని ఓదార్చారు.

సుబ్బయ్య గారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ప్రసాదించాలని సుగవాసి ప్రసాద్ బాబు గారు ప్రార్థించారు.

Tags:    

Similar News