Rayachoti: రాయచోటిలో సీసీటీవీ నిఘాతో 20 నిమిషాల్లో బంగారు బ్యాగ్ గుర్తింపు

Rayachoti: రాయచోటిలో ఆటోలో మరిచిపోయిన రూ.10 లక్షల విలువైన బంగారం, వెండి బ్యాగ్‌ను సీసీటీవీ నిఘాతో కేవలం 20 నిమిషాల్లో గుర్తించి బాధితురాలికి అప్పగించిన పోలీసులు.

Update: 2026-08-08 14:29 GMT

Rayachoti: రాయచోటిలో సీసీటీవీ నిఘాతో 20 నిమిషాల్లో బంగారు బ్యాగ్ గుర్తింపు

రాయచోటి: CCTV నిఘాతో 20 నిమిషాల్లో రూ.10 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాల బ్యాగ్‌ను గుర్తించి బాధితురాలికి అప్పగించిన రాయచోటి అర్బన్ పోలీసులు.

రాయచోటి టౌన్, కొత్తపల్లి కరిమియా మసీదు వీధికి చెందిన షేక్ మెహరాజ్, భర్త ఆరిఫుల్లా, ఈ రోజు మధ్యాహ్నం సుమారు 12:30 గంటల సమయంలో ఆటోలో ప్రయాణిస్తూ, తన వద్ద ఉన్న సుమారు 6 తులాల బంగారు ఆభరణాలు మరియు 30 తులాల వెండి ఆభరణాలు కలిగిన బ్యాగ్‌ను ఆటోలోనే మరిచిపోయి వెళ్లిపోయారు.

అనంతరం బాధితురాలు వెంటనే రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకురాగా, పోలీసులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్పందించారు. సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తూ, బాధితురాలు ప్రయాణించిన ఆటోను మరియు అది వెళ్లిన మార్గాన్ని గుర్తించే చర్యలు చేపట్టారు.

పోలీసుల తక్షణ స్పందన, నిరంతర CCTV పర్యవేక్షణ ఫలితంగా కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే బ్యాగ్‌ను గుర్తించి, అందులో ఉన్న సుమారు 6 తులాల బంగారు ఆభరణాలు, 30 తులాల వెండి ఆభరణాలు, మొత్తం విలువ సుమారు రూ.10 లక్షలు ఉన్న ఆభరణాలను సురక్షితంగా స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం సదరు బంగారు మరియు వెండి ఆభరణాలను రాయచోటి అర్బన్ పోలీస్ ఇన్స్పెక్టర్ బి.వి. చలపతి గారు మరియు ఎస్‌.ఐ. ఎం. విష్ణువర్ధన్ గారు బాధితురాలు షేక్ మెహరాజ్‌కు సురక్షితంగా అప్పగించారు. ఈ సందర్భంగా బాధితురాలు పోలీసుల తక్షణ స్పందనకు, ప్రత్యేకించి CCTV కెమెరాల ద్వారా తన విలువైన ఆభరణాలను త్వరగా గుర్తించి తిరిగి అందించినందుకు రాయచోటి అర్బన్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

Tags:    

Similar News