Proddutur: భార్య లావుగా ఉందని.. యూట్యూబ్ చూసి హత్య చేసిన భర్త!
Proddutur: ప్రొద్దుటూరులో పద్మజ మృతి కేసును పోలీసులు ఛేదించారు. భర్త కిరణ్ కుమార్ యూట్యూబ్ లో చూసి విషం ఇచ్చి భార్యను హత్య చేసినట్లు ఏఎస్పీ విబూ కృష్ణ తెలిపారు.
Proddutur: భార్య లావుగా ఉందని.. యూట్యూబ్ చూసి హత్య చేసిన భర్త!
ప్రొద్దుటూరు: కడప జిల్లా ప్రొద్దుటూరులో వివాహిత పద్మజ అనుమానాస్పద మృతి కేసును పోలీసులు చేధించారు. భర్త కిరణ్ కుమార్ హత్య చేసినట్లు నిర్ధారించారు. కిరణ్ కుమార్ ను అరెస్టు చేసి మీడియా ఎదుట హాజరు పరిచారు. ప్రొద్దుటూరు ఏఎస్పీ విబూ కృష్ణ వెల్లడించారు..భార్య లావుగా ఉండటం, భర్తను అనుమానిస్తుడటంతో హత్యకు ప్రణాళిక రచించాడు...భార్యను చంపడం ఎలా అని...యుట్యూబ్ లో శోధించి చంపేందుకు సిద్ధం అయ్యాడు. హైదరాబాద్ నుంచి కొరియర్ ద్వారా విషాన్ని ప్రొద్దుటూరు తెప్పించాడు. పాలకోవాలో కలిపి భార్యకు ఇవ్వడంతో అది తిని ఆమె అపస్మారక స్థితిలో కి వెళ్లారని ఏఎస్పీ తెలిపారు. చనిపోయిందో లేదో అనే అనుమానంతో ముఖం పై దిండు పెట్టి గట్టిగా నిక్కాడని ఏఎస్పి తెలిపారు.నిందితుడిని రిమాండ్ కు తరలించినట్లు వివరించారు.