Mydukur: రైతులే స్వయంగా ఈ-పంట నమోదు చేసుకోవచ్చు AO అమర్నాథరెడ్డి!

Mydukur: రైతులు తమ మొబైల్ ఫోన్ ద్వారా APAIMS 2.0 యాప్‌లో స్వయంగా ఈ-క్రాప్ నమోదు చేసుకోవచ్చని మైదుకూరు మండల వ్యవసాయ అధికారి అమర్నాథరెడ్డి వెల్లడి.

Update: 2026-08-18 02:12 GMT

Mydukur: రైతులే స్వయంగా ఈ-పంట నమోదు చేసుకోవచ్చు AO అమర్నాథరెడ్డి!

Mydukur: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం, రైతులు తమ మొబైల్ ఫోన్ ద్వారానే స్వయంగా ఈ క్రాప్ (ఇ-పంట) నమోదు చేసుకోవచ్చు అని మండల వ్యవసాయ అధికారి అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రైతులు (ఆర్ ఎస్ కే) రైతు సేవా కేంద్రం సిబ్బందిని కలువకుండానే వివరాలను నమోదు చేసుకోవచ్చు . ఈ విధానము ద్వారా సమయము ఆదా అవుతుంది ,ఎటువంటి పొరపాట్లు తప్పులు లేకుండా రైతు తమ పంట వివరాలను నమోదు చేసుకునే అవకాశం ఉంది.

నమోదు చేసుకునే విధానం గూగుల్ ప్లే స్టోర్ నుండి ఏపిఏఐఎం ఎస్ 2.0 యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.మీ ఆధార్ నంబర్ తో రిజిస్టర్ అయి, ఎంపీఐఎన్ సెట్ చేసుకోవాలి.వెబ్‌ల్యాండ్ ఆధారంగా మీ భూమి వివరాలు యాప్‌లో కనిపిస్తాయి.పొలంలో ఉంటూ పంట ఫోటోను జియో-ట్యాగింగ్ ద్వారా క్యాప్చర్ చేసి వివరాలు ఎంటర్ చేయాలి.మీరు నమోదు చేసిన వివరాలను స్థానిక రైతు సేవా కేంద్రం (ఆర్ ఎస్ కె )సిబ్బంది పరిశీలించి ధ్రువీకరిస్తారు.

Tags:    

Similar News