Kadapa: కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తం ఏఐటీయూసీ నేతలు పోలీసుల మధ్య తోపులాట

Kadapa: కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్.

Update: 2026-08-18 12:32 GMT

Kadapa: కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తం ఏఐటీయూసీ నేతలు పోలీసుల మధ్య తోపులాట

కడప: కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ కార్యాలయం ముట్టడి, కలెక్టరేట్ కార్యాలయంలోకి చొచ్చుకువెళ్లే ప్రయత్నం చేసిన ఉద్యమకారులు, దీంతో పోలీసులు, ఉద్యమకారుల మధ్య తోపులాట జరిగింది.

కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులకు పర్మినెంట్ చేసి , కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్, 4 లేబర్ కోడ్ రద్దు చేసి, 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలి, (అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన ) స్కీమ్ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, హమాలీ, ఆటో, వీధి విక్రయదారుల కార్మికులకు సంక్షేమం బోర్డు ఏర్పాటు చేయాలి.

Tags:    

Similar News