Vikarabad: మలుపు తిరుగుతుండగా ప్రమాదం.. పరిగి ఆసుపత్రిలో వృద్ధురాలి పరిస్థితి విషమం

Vikarabad: పరిగి పట్టణంలో రోడ్డు ప్రమాదం.. తున్కిమెట్ల తల్లికొడుకులకు గాయాలు. లారీ వెనుక భాగం తగలడంతో బైక్ పై నుండి పడిపోయిన వృద్ధురాలు.

Update: 2026-04-03 06:10 GMT

Vikarabad: మలుపు తిరుగుతుండగా ప్రమాదం.. పరిగి ఆసుపత్రిలో వృద్ధురాలి పరిస్థితి విషమం

Vikarabad: వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొడంగల్ చౌరస్తా సమీపంలో లారీ షాద్ నగర్ వైపు మల్లుతుండగా వెనుక నుంచి వస్తున్న బైక్ కి లారీ వెనుక భాగం తగలడంతో ఒక్కసారికి బైక్ పై ఉన్న మహిళ చెయ్యి లారీ వెనుక టైర్ కింద పడింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఓ వృద్ధురాలికి తీవ్ర గాయాలయ్యాయి. ఒక చెయ్యి నుజ్జు నుజ్జు అయ్యింది. ప్రమాదానికి గురైన వారు పరిగి మండలం తున్కిమెట్ల గ్రామానికి చెందిన తల్లి, కొడుకులుగా గుర్తించారు. తల్లి, కొడుకు కలిసి పని నిమిత్తం తున్కిమెట్ల నుండి పరిగికి వస్తుండగా, కొడంగల్ చౌరస్తా వద్ద ఈ ప్రమాదం సంభవించింది. తీవ్రంగా గాయపడిన వృద్ధురాలిని వెంటనే చికిత్స నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News