Tirupati: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే - యాకసిరి గ్రామస్తుల హర్షం
Tirupati: తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం యాకసిరి గ్రామంలో ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ నిధులతో సిమెంటు రోడ్డు పనులను టీడీపీ నాయకులు ప్రారంభించారు.
Tirupati: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే - యాకసిరి గ్రామస్తుల హర్షం
తిరుపతి జిల్లా: చిట్టమూరు మండలం యాకసిరి గ్రామంలో 5 లక్షల రూపాయలతో సిమెంటు రోడ్డు పనులను ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ నాయకులు గంపర్ల చిన్నారావు, నాగార్జున సీనియర్ నాయకులు దినేష్ బాబు లు మరియు ఇంజనీరింగ్ అసిస్టెంట్ జి శివమణి తదితరులు పాల్గొన్నారు, అనంతరం వారు తెలియజేస్తూ గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ ఆదేశాలతో యాక సిరి అంబేద్కర్ హరిజనవాడ ప్రాంతంలో 5 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డును ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అటు సంక్షేమంలోనూ ఇటు అభివృద్ధిలోనూ నియోజకవర్గం పాశం సునీల్ కుమార్ కు మరియు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కు తాము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని వారు తెలియజేశారు, యాక సిరి గ్రామస్తుల ఇబ్బందులను తెలుసుకొని రోడ్డు నిర్మాణ కొరకు నిధులు అడిగిన వెంటనే వాటిని మంజూరు చేసిన ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ కు ఏకశిరి గ్రామ ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారని వారు తెలియజేశారు, స్థానిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి విజయాన్ని చేకూర్చాలని తెలుగుదేశం పార్టీ నాయకులు గంపర్ల చిన్నారావు తెలియజేశారు.