Gudivada Amarnath: 2029లో మళ్లీ జగనే సీఎం.. ఎన్ని పార్టీలు కలిసినా మా గెలుపు ఆపలేరు

పెందుర్తి: 2029లో మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు.

Update: 2026-03-12 07:21 GMT

Gudivada Amarnath: 2029లో మళ్లీ జగనే సీఎం.. ఎన్ని పార్టీలు కలిసినా మా గెలుపు ఆపలేరు

పెందుర్తి: 2029లో మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వేపగుంట జంక్షన్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలు వేసి ముందుగా ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎన్ని పార్టీలు కలిసి వచ్చిన 2029లో మళ్లీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవడంతో పాటు పేద ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటారని పేర్కొన్నారు. కార్యకర్తలు అందరు కలిసికట్టుగా పోరాటం చేసి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసే విధంగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్ మన్యం పరిశీలకు చిన్న అప్పల నాయుడు. పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News