Nizamabad: మద్యం సేవించి స్టీరింగ్ పడితే జేబు ఖాళీ.. నలుగురికి రూ. 40 వేల జరిమానా!

Nizamabad: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన నలుగురు వ్యక్తులకు కోర్టు రూ. 40 వేల జరిమానా విధించింది.

Update: 2026-04-03 07:08 GMT

Nizamabad: మద్యం సేవించి స్టీరింగ్ పడితే జేబు ఖాళీ.. నలుగురికి రూ. 40 వేల జరిమానా!

నిజామాబాద్: ఆర్మూర్ పట్టణ మున్సిపల్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఎన్ఫోర్మెంట్స్ నిర్వహించారు, దీంతో డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన నలుగురు వ్యక్తులను కోర్టులో హాజరు పరచగా.. ఆ వ్యక్తులకు ఒకొక్కడికి 10 వేల చొప్పున, నలుగురికి 40 వేల రూపాయలు జరిమానా, జె ఎఫ్ సి ఎం మెజిస్ట్రేట్ సరళ రాణి, విధించినట్లు పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ సత్యనారాయణ గౌడ్ తెలిపారు, వాహనదారులు వారి వాహనాలను మద్యం సేవించి నరపరాదని, ఒకవేళ మద్యం సేవించి నడపడంతో, యాక్సిడెంట్లు అవుతాయంటూ, వాహనదారులకు మోటార్ వెహికల్ నూతన చట్ట ప్రకారం, భారీగా జరిమానాలు, జైలు శిక్షలు కూడా పెరగడం జరిగిందని, వాహనాల ధృవపత్రాలు వాహనదారుల వెంట ఉంచుకోవాలని సిఐ సత్యనారాయణ గౌడ్ సూచించారు.

Tags:    

Similar News