US Immigration: అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ దరఖాస్తుల్లో బిగ్ ఛేంజ్
US Immigration: అమెరికా ఇమిగ్రేషన్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి. యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఇకపై దరఖాస్తుల ప్రక్రియను డిజిటల్ రూపంలోకి మార్చనుంది.
US Immigration
US Immigration:అమెరికా తమ దేశంలోకి వచ్చే ఇమిగ్రెంట్ దరఖాస్తుల విధానాన్ని పూర్తిగా ఆన్‌లైన్ చేసేందుకు సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు నడుస్తున్న కాగితాల ప్రక్రియకు స్వస్తి పలుకుతూ ప్రతి దరఖాస్తును డిజిటల్ పద్ధతిలోనే స్వీకరించాలని యూఎస్‌సీఐఎస్ నిర్ణయించింది. ఈ నూతన నిబంధన వల్ల గ్రీన్ కార్డ్, పౌరసత్వం, వర్క్ పర్మిట్లు, ఫ్యామిలీ పిటిషన్ల దాఖలు వేగవంతం కానుంది. ఏదేమైనా కొత్త విధానం అమలులోకి రావడానికి ముందే ఏరికోరి నిర్దిష్ట ఫారమ్‌లపై 60 రోజుల ముందస్తు నోటీసు ఇవ్వనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే ఆరు నెలలకు పైగా డిజిటల్ విధానంలో అందుబాటులో ఉన్న ఫారమ్‌లకే ఈ కొత్త నిబంధన ముందుగా వర్తిస్తుంది.
బిలియన్ డాలర్ల వ్యయం ఆదా
ఇప్పటివరకు పేపర్ ఫైలింగ్ విధానం వల్ల డేటా ఎంట్రీ, స్కానింగ్, భద్రపరచడం, డెలివరీల కోసం విపరీతమైన సమయం, కోట్ల డాలర్లు ఖర్చవుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 1.4 కోట్లకు పైగా దరఖాస్తులను ప్రాసెస్ చేసిన ఏజెన్సీ, కోట్లాది పేజీల కాగితాలను నిర్వహించేందుకు వందలాది మిలియన్ డాలర్లను వెచ్చించాల్సి వచ్చింది. డిజిటల్ విధానం అమలులోకి వస్తే తప్పులు తగ్గడమే కాకుండా దరఖాస్తుల తనిఖీ వేగవంతమై ఫ్రాడ్ కేసులను సులభంగా గుర్తించవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత దరఖాస్తుదారులు పోస్టల్ ఖర్చులు భరించాల్సిన అవసరం ఉండదు.
భారతీయుల గ్రీన్ కార్డ్ నిరీక్షణ తగ్గుతుందా?
ఈ డిజిటల్ విప్లవం వల్ల దరఖాస్తు దాఖలు ప్రక్రియ వేగవంతమైనప్పటికీ భారతీయుల ఏళ్ల నాటి గ్రీన్ కార్డ్ నిరీక్షణ కాలం మాత్రం వెంటనే తగ్గిపోదు. హెచ్-1బీ వీసాపై ఉన్న వేలాది మంది ఉద్యోగులు గ్రీన్ కార్డ్ కోసం దశాబ్దాలుగా వేచి చూస్తున్నారు. గ్రీన్ కార్డ్ కేటాయింపు అనేది సంబంధిత దేశాల కోటా, ప్రాధాన్యత తేదీల పైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆన్‌లైన్ ఫైలింగ్ వల్ల ప్రాసెసింగ్ సమయం మాత్రమే కలిసి వస్తుంది తప్ప కోటా పరిమితుల్లో ఎలాంటి మార్పు ఉండదు. దీనివల్ల టెక్నాలజీ పై పట్టు ఉన్న యువతకు మేలు జరుగుతున్నప్పటికీ, వయోవృద్ధులు, డిజిటల్ పరిజ్ఞానం లేని వారికి ఆన్‌లైన్ ఖాతాల నిర్వహణ కొంత ఇబ్బందికరంగా మారే అవకాశముంది.
అమెరికా ఇమిగ్రేషన్ విధానం డిజిటల్ కావడం వల్ల దరఖాస్తులు చేసుకునే విధానం మాత్రమే సులభతరం అవుతుంది. గ్రీన్ కార్డ్ నిరీక్షణ రేసులో ఎలాంటి పెద్ద మార్పులు ఉండవు కాబట్టి దరఖాస్తుదారులు తమ పత్రాలన్నింటినీ ముందుగానే డిజిటల్ కాపీలుగా