Hyderabad: వనస్థలిపురం ఆటోనగర్‌లో ఇసుక లారీ యజమానుల 'జైలు భరో'

Hyderabad: హైదరాబాద్ వనస్థలిపురం ఆటోనగర్‌లో ఇసుక లారీ యజమానుల 'జైలు భరో'. పెరిగిన ధరలు, అక్రమ వసూళ్లను నిరసిస్తూ పెద్ద ఎత్తున నిరసన తెలిపారు.

Update: 2026-08-10 03:21 GMT

Hyderabad: వనస్థలిపురం ఆటోనగర్‌లో ఇసుక లారీ యజమానుల 'జైలు భరో'

శెట్టి గౌడ్ ఎల్బీనగర్...

కార్మికుల సమస్యలపై ‘జైల్‌ భరో’

వనస్థలిపురం ఆటోనగర్‌లో ఇసుక లారీ యజమానుల భారీ నిరసన

వనస్థలిపురం....కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు, రవాణా రంగంపై తీసుకొస్తున్న చట్టాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా చేపట్టిన ‘ జైల్‌ బరో కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌ వనస్థలిపురం ఆటోనగర్‌లో తెలంగాణ రాష్ట్ర ఇసుక లారీ యజమానుల సంఘం ఆధ్వర్యంలో భారీ నిరసన నిర్వహించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఇసుక లారీ యజమానులు, డ్రైవర్లు, ఇసుక ఖాళీ చేసే కార్మికులు పాల్గొన్నారు.

సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్, ప్రధాన కార్యదర్శి సప్పిడి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. రవాణా రంగంపై భారాన్ని పెంచే విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న డీజిల్‌, పెట్రోల్‌ ధరలతో లారీ యజమానులు, డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలోని ఇసుక రీచ్‌ల వద్ద జరుగుతున్న అక్రమ డబ్బుల వసూళ్లను అరికట్టాలని, రీచ్‌లలో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇతర రాష్ట్రాల నుంచి జరుగుతున్న అక్రమ ఇసుక రవాణాపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ఫిల్టర్‌ ఇసుక తయారీపై ప్రత్యేక దృష్టి సారించి, అక్రమ కార్యకలాపాలను అరికట్టాలని కోరారు. కార్మికులు, డ్రైవర్లు, లారీ యజమానుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని సంఘం నాయకులు హెచ్చరించారు.

ప్రధాన డిమాండ్లు:

- రవాణా రంగానికి వ్యతిరేకంగా ఉన్న చట్టాలను రద్దు చేయాలి

- డీజిల్‌, పెట్రోల్‌ ధరలను నియంత్రించాలి

- ఇసుక రీచ్‌లలో అక్రమ వసూళ్లను అరికట్టాలి

- డ్రైవర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

- ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ ఇసుక రవాణాను నిలిపివేయాలి

- ఫిల్టర్‌ ఇసుక తయారీపై కఠిన చర్యలు తీసుకోవాలి.

Tags:    

Similar News