LB Nagar: నాగోలులో కలకలం పనికి వెళ్లి తిరిగి రాని డెలివరీ బాయ్!

LB Nagar: ఎల్బీనగర్ పరిధిలోని నాగోలులో జెప్టో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న సైదు భాగ్యరాజు (34) అదృశ్యమయ్యాడు.

Update: 2026-08-09 14:54 GMT

LB Nagar: నాగోలులో కలకలం పనికి వెళ్లి తిరిగి రాని డెలివరీ బాయ్!

LB Nagar: నాగోలు జెప్టో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న ఓ యువకుడు పని నిమిత్తం ఇంటి నుంచి వెళ్లి అదృశ్యమైన ఘటన నాగోలు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. నాగోలులోని కో-ఆపరేటివ్ బ్యాంక్ కాలనీకి చెందిన సైదు భాగ్యరాజు (34) జెప్టోలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు.

ఈ నెల 4న డెలివరీ పని ఉందని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లిన భాగ్యరాజు తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితులు, పరిచయస్తుల వద్ద ఆరా తీసినా ఆచూకీ లభించలేదు. దీంతో ఆందోళనకు గురైన అతడి భార్య రేవతి నాగోలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఫిర్యాదు మేరకు పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భాగ్యరాజు చివరిసారిగా ఎక్కడికి వెళ్లాడు, ఎవరిని కలిశాడు, ఎవరితో ఫోన్‌లో మాట్లాడాడు అనే కోణాల్లో వివరాలు సేకరిస్తున్నారు. ఫోన్ కాల్ వివరాలు, ఇతర ఆధారాలను పరిశీలిస్తూ అతడి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు నాగోలు సీఐ మహమ్మద్ మక్బూల్ జానీ తెలిపారు. ఆచూకీ లభించిన వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తామని పోలీసులు పేర్కొన్నారు.

Tags:    

Similar News