Hyderabad: హైదరాబాద్ జూపార్క్‌లో వైభవంగా 'ప్రపంచ సింహాల దినోత్సవం'!
Hyderabad: నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో ప్రపంచ సింహాల దినోత్సవం ఘనంగా జరిగింది. జంతు సంరక్షకుల టాక్ షోలు, సింహాల అలవాట్లు, ఆహారం, వైద్యంపై పర్యాటకులకు అవగాహన కల్పించారు.
Hyderabad: హైదరాబాద్ జూపార్క్‌లో వైభవంగా 'ప్రపంచ సింహాల దినోత్సవం'!
హైదరాబాద్: ఈ రోజు హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ లో ప్రపంచ సింహాల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో భాగంగా జంతు సంరక్షకుల టాక్ షోలను నిర్వహించారు. ఇందులో భాగంగా జంతు సంరక్షకులు తాము రోజువారీ చేసే పనులు, సింహాల ప్రవర్తన, ప్రతిరోజూ అందించే ఆహార పట్టిక, టీకాల తదితర కార్యక్రమాల గురించి వివరించారు.
ఈ సందర్భంగా నెహ్రూ జూలాజికల్ పార్క్ డిప్యూటీ క్యూరేటర్ శ్రీ జె. మురళీధర్ మాట్లాడుతూ... ప్రతి పర్యావరణ దినోత్సవం నాడు వన్యప్రాణి విద్య మరియు అవగాహన కార్యక్రమాలను నిర్వహించడంలో నెహ్రూ జూలాజికల్ పార్క్ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందని తెలిపారు. ఈ రోజు ప్రపంచ సింహాల దినోత్సవ వేడుకల సందర్భంగా, ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని దీనిని విజయవంతం చేసినందుకు పాల్గొన్న వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.
నెహ్రూ జూలాజికల్ పార్క్, హైదరాబాద్‌లోని సంబంధిత ఎన్‌క్లోజర్లలో ఆసియా మరియు ఆఫ్రికన్ సింహాలు రెండింటినీ సంరక్షిస్తున్నారు. జూలో సఫారీ నీమొదటగా 1974 సంవత్సరంలో నెహ్రూ జూలాజికల్ పార్క్‌లోనే ప్రారంభించారు. ఆ సమయంలోనే మొదటి లైన్ సఫారీ పార్క్ అందుబాటులోకి వచ్చింది. ఈ సఫారీ మొత్తం వైశాల్యం 45 ఎకరాలు. ప్రతిరోజూ ఉదయం సింహాల గుంపును సఫారీలోకి వదులుతారు. ఇక్కడ జంతువులు స్వేచ్ఛగా సంచరిస్తుంటే సందర్శకులు వాహనాల నుండి వీక్షిస్తారు. ఇది సందర్శకులకు ఒక రోమాంచకమైన అనుభూతిని కలిగిస్తుంది. ఈ కార్యక్రమంలో అధికారులు,జూ సిబ్బంది పాల్గొన్నారు.