Vikarabad: జూన్ 1 నుండి ఓవర్సీస్ స్కాలర్‌షిప్ ఆన్‌లైన్ దరఖాస్తులు!
Vikarabad: మైనారిటీ విద్యార్థుల కోసం ‘చీఫ్ మినిస్టర్ ఓవర్సీస్ స్కీమ్’ స్కాలర్‌షిప్ (ఫాల్ సీజన్ 2026) ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం.
Vikarabad: జూన్ 1 నుండి ఓవర్సీస్ స్కాలర్‌షిప్ ఆన్‌లైన్ దరఖాస్తులు!
Vikarabad: మైనారిటీ విద్యార్థుల కోసం చీఫ్ మినిస్టర్ ఓవర్సీస్ స్కీమ్ స్కాలర్షిప్ కింద ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవాలని మైనార్టీ సంక్షేమ అధికారి (ఇంచార్జి) ఎం. సుధీర్ ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 1 నుండి 30వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ నిర్వహించిన చీఫ్ మినిస్టర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం ఫాల సీజన్ 2026 కింద, విదేశాలలో ఉన్నత విద్య (పోస్ట్ గ్రాడ్యుయేట్/పీహెచ్) చదువుతున్న మైనారిటీ విద్యార్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.
అమెరికా, యుకె, ఆస్ట్రియా, కెనడా, సింగపూర్, జర్మనీ, దక్షిణ కొరియా, జపాన్, ఫ్రాన్స్, న్యూజిలాండ్ వంటి విదేశీ దేశాల గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయా లలో జూన్ 1 నుండి 30 వరకు పోస్ట్ గ్రాడ్యుయేట్ లేదా పిహెచి అధ్యయనాలలో ప్రవేశం పొందిన ప్రభుత్వ అర్హత నియమాలన్నింటినీ నెరవేర్చిన అర్హతగల అభ్య ర్థులు తమ దరఖాస్తులను వెబ్సైట్లో (డబ్ల్యూ డబ్ల్యూ. తెలంగాణ ఈపాస్. సిజిజి. జిఓవి. ఇన్) సమర్పించవచ్చని తెలిపారు.
.అర్హులైన అభ్యర్థులు ఈ నెల 30 సాయంత్రం 5.00 గంటల వరకు ఆన్లైన్లో దరఖా స్తులను సమర్పించవచ్చని తెలిపారు. తరువాత, దరఖాస్తు హార్డ్ కాపీ మరియు అవసరమైన పత్రాలు/ధృవపత్రాలను 31-07-2026 సాయంత్రం 5.00 గంటలలోపు జిల్లా అధికారి, మైనారిటీ సంక్షేమ శాఖ, వికారాబాద్ కు సమర్పించండి. ఈ పథకం కింద ఎంపికైన విద్యార్థులకు రూ.20 లక్షలు మరియు రూ.60,000 వన్-వే విమాన ఛార్జీ (లేదా వాస్తవ ఛార్జీ, ఏది తక్కువైతే అది) ఇవ్వబడుతుందని ఆయన చెప్పారు. పత్రాల పరిశీలన సమయంలో నకిలీ సర్టిఫికెట్లు ఉంటే అభ్యర్థులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
వయస్సు, విద్యార్హత, వార్షిక ఆదాయం, ఇతర ముఖ్యమైన వివరాలతో సహా పథకం యొక్క అన్ని వివరాల కోసం, వెబ్సైట్ను సందర్శించాలని వికారాబాద్ లో అర్హులైన మైనారిటీ విద్యార్థులు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.