Medchal: మేడ్చల్ బీఆర్ఎస్ మీటింగ్‌లో రసాభాస
Medchal: పార్లమెంట్ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి ఎదుట తిరగబడ్డ రావల్‌కోల్ ఉద్యమకారులు.. మాజీ మంత్రి మల్లారెడ్డిపై ఫైర్, కండువాలు మోయడానికేనా అంటూ సాయన్న ఆవేదన.
Medchal: మేడ్చల్ బీఆర్ఎస్ మీటింగ్‌లో రసాభాస
మేడ్చల్: మేడ్చల్ పట్టణంలోని శ్రీ గార్డెన్ లో ఏర్పాటు చేసిన బి ఆర్ ఎస్ పార్టీ విస్తృత సమావేశంలో రసాభాస. తిరగబడ్డ సొంత పార్టీ నేతలు మల్కాజిగిరి పార్లమెంట్ ఇంచార్జి రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతుండగా తిరగబడ్డ రావల్ కోల్ గ్రామానికి చెందిన కార్యకర్త సాయన్న పార్టీలో తమకు గుర్తింపు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన బిఆర్ఎస్ పార్టీ ఉద్యమ నాయకులు రావల్ కోల్ గ్రామం లో ఏర్పాటు చేస్తున్న క్రషర్ మిషన్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ కలెక్టరేట్ ముందు తాము ధర్నా చేస్తుంటే చామకూర మల్లారెడ్డి చూసి చూడనట్టు వ్యవహరించారని ఆవేదన.
ఉద్యమ కారులకు గుర్తింపులేదని ఆందోళనకు దిగిన కార్యకర్తలు. ఉద్యమకారులు ఇంకా పార్టీ కండువాలు మోసేవరకే కానీ గుర్తింపు లేదని మండిపాటు. ఇలాగే ఉంటే ముందు ముందు బిఆర్ఎస్ పార్టీ కనుమరుగవడం ఖాయమంటున్న ఉద్యమ కారులు బిఆర్ఎస్ కార్యకర్తలు గత తెలంగాణ రాకముందు నుంచి పార్టీ కోసం పని చేస్తే కనీసం ఆహ్వానం లేదని,కనీసం ఫ్లెక్సీల్లో తమ ఫొటోలు కూడా లేదని మండిపాటు. మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి పై రెచ్చిపోయిన ఉద్యమ కారులు.