Hyderabad: పట్నం కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి!
Hyderabad: మాతృవియోగంతో బాధపడుతున్న ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి కుటుంబాన్ని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి పరామర్శించి నివాళులర్పించారు.
Hyderabad: పట్నం కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి!
Hyderabad: మాతృవియోగంతో బాధలో ఉన్న పట్నం కుటుంబాన్ని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి పరామర్శించారు. మండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్‌రెడ్డి మాతృమూర్తి పట్నం రుక్కమ్మ మృతి చెందిన నేపథ్యంలో బంజారాహిల్స్‌లోని ఆయన నివాసానికి వెళ్లారు.
పట్నం రుక్కమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సుధీర్‌రెడ్డి.. మహేందర్‌రెడ్డితో పాటు మల్కాజిగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి, జిల్లా పరిషత్ మాజీ చైర్‌పర్సన్ పట్నం సునీతారెడ్డికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఈ సందర్భంగా పట్నం కుటుంబ సభ్యులను ఓదార్చి, రుక్కమ్మ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ సీనియర్ నాయకులు గజ్జల మధుసూదన్‌రెడ్డి, రామేశ్వర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.