Gajularamaram: అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తప్పవు.. అధికారులు!

Gajularamaram: గాజులరామారం నుంచి మహాదేవపురం వరకు రహదారి ఆక్రమణల తొలగింపు ప్రత్యేక డ్రైవ్.

Update: 2026-08-08 03:28 GMT

Gajularamaram: అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తప్పవు.. అధికారులు!

Gajularamaram: వాక్ ఫ్రీ లో భాగంగా కార్యక్రమాన్ని సైబరాబాద్ వ్యాప్తంగా నిరంతరం కొనసాగించనున్నారు.

గాజులరామారంమహాదేవపురం రహదారి పై ఆక్రమణలకు చెక్

- గాజులరామారం కూడలి నుండి మహాదేవపురం వరకు ప్రత్యేక డ్రైవ్

- వాహనాల రాకపోకలకు ఆటంకంగా ఉన్న ఆక్రమణల తొలగింపు

- అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తప్పవని ఉప కమిషనర్ హెచ్చరిక

- సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్, కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ ఆదేశాలతో చర్యలు

- టౌన్ ప్లానింగ్ అధికారుల ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు

-ప్రజలు సహకరించాలని, రహదారులను ఆక్రమించవద్దని అధికారుల విజ్ఞప్తి

సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్,

కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ ఆదేశాల మేరకు గాజులరామారం సర్కిల్ పరిధిలోని గాజులరామారం చౌరస్తా నుంచి మహాదేవపురం వరకు ఉన్న ప్రధాన రహదారిపై ప్రత్యేక ఆక్రమణల తొలగింపు కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా రహదారిని ఆక్రమించిన నిర్మాణాలు, ఇతర అడ్డంకులను తొలగిస్తూ చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా గాజులరామారం ఉప కమిషనర్ యూ. వెంకట్ రాములు మాట్లాడుతూ, సర్కిల్ పరిధిలో ప్రభుత్వ భూములు, రహదారులు లేదా ఫుట్పాత్లపై ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపడితే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు స్వచ్ఛందంగా ఆక్రమణలు తొలగించి నగర అభివృద్ధికి సహకరించాలని సూచించారు. ఈ ప్రత్యేక డ్రైవ్లో అసిస్టెంట్ సిటీ ప్లానర్ సుమిత్ర, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ (పూూ) బి. సరిత సేన్ తమ సిబ్బందితో కలిసి పాల్గొని ఆక్రమణల తొలగింపు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. భవిష్యత్తులో కూడా రహదారులపై ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలపై నిరంతర తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.

కుత్బుల్లాపూర్ జోనల్ పరిధి లో మొత్తం తొలగించిన వివరాలు:

కుత్బుల్లాపూర్ జోన్ – 6.3 కి.మీ | 150 ఆక్రమణలు తొలగింపు

చింతల్ – 14 | జీడిమెట్ల – 24 | కొంపల్లి – 35 | గాజులరామారం – 20 | నిజాంపేట్ – 26 | దుండిగల్ – 16 | మేడ్చల్ – 15

Tags:    

Similar News