LB Nagar: విజయ గార్డెన్స్‌లో ఓపెన్ జిమ్, చిల్డ్రన్స్ పార్క్ ప్రారంభం!
LB Nagar: ఎల్బీనగర్ నియోజకవర్గం నాగోల్ పరిధిలోని విజయ గార్డెన్స్ కాలనీలో ఓపెన్ జిమ్, చిల్డ్రన్స్ పార్క్‌ను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రారంభించారు.
LB Nagar: విజయ గార్డెన్స్‌లో ఓపెన్ జిమ్, చిల్డ్రన్స్ పార్క్ ప్రారంభం!
LB Nagar: నాగోల్ డివిజన్ పరిధిలోని విజయ గార్డెన్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్‌లో నూతనంగా నిర్మించిన ఓపెన్ జిమ్ మరియు చిల్డ్రన్స్ పార్క్‌ను ఎల్.బి.నగర్ శాసనసభ్యులు శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు ప్రారంభించారు.ఈ సందర్భంగా కాలనీ ప్రజలతో ఎమ్మెల్యే గారు మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ప్రజల ఆరోగ్యం,పిల్లల ఆటలు మరియు ఆహ్లాదకరమైన వాతావరణం కోసం ఓపెన్ జిమ్,చిల్డ్రన్స్ పార్క్ ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు.కాలనీ ప్రజలు తమకు అవసరమైన సౌకర్యాలను కల్పించిన ఎమ్మెల్యే శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇట్టి కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ చెరుకు సంగీత ప్రశాంత్ గౌడ్,సీనియర్ నాయకులు ఆనంతుల రాజిరెడ్డి,డివిజన్ అధ్యక్షులు తూర్పటి.చిరంజీవి,శిల్పరెడ్డి,పోచంపల్లి రాజేందర్ రెడ్డి,కాలనీ అధ్యక్షులు రాంచంద్రరెడ్డి,మల్లారెడ్డి,సూర్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.