Hyderabad: సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కీలక సమీక్ష సమావేశం!
Hyderabad: జలసౌధలో నీటి పారుదల ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక సమీక్ష. భూసేకరణ, పరిహారం, ఆర్ & ఆర్, అటవీ అనుమతులపై జిల్లాల వారీగా చర్చ.
Hyderabad: సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కీలక సమీక్ష సమావేశం!
Hyderabad: నీటి పారుదల ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ ఇవాళ కీలక సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు జలసౌధలో జిల్లా కలెక్టర్లు, ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్లతో మంత్రి సమావేశం కానున్నారు. భూసేకరణ, ఆర్ అండ్ ఆర్, అటవీ అనుమతులపై జిల్లాల వారీగా మంత్రి సమీక్షించనున్నారు. అలాగే పెండింగ్ భూసేకరణ ప్రక్రియపై ప్రాజెక్టుల వారీగా ఆరా తీయనున్నారు.
భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లింపులపై దృష్టి సారించనున్నారు. నిర్వాసితుల ఆర్ అండ్ ఆర్ పనుల పురోగతిని సమీక్షించనున్నారు మంత్రి ఉత్తమ్. అదేవిధంగా ప్రాజెక్టులకు అడ్డంకిగా ఉన్న అటవీ సమస్యలపై చర్చించనున్నారు. అర్హులైన రైతులు, లబ్ధిదారులకు పూర్తి పరిహారం అందేలా కార్యాచరణ రూపొందించనున్నారు.