Jubilee Hills: శ్రీనగర్ కాలనీలో డ్రైనేజీ సమస్యల పరిశీలన ఎమ్మెల్యే!
Jubilee Hills: శ్రీనగర్ కాలనీలో పొంగిపొర్లుతున్న డ్రైనేజీ సమస్యను పరిశీలించిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్. తక్షణ పరిష్కారానికి అధికారులకు ఆదేశం.
Jubilee Hills: శ్రీనగర్ కాలనీలో డ్రైనేజీ సమస్యల పరిశీలన ఎమ్మెల్యే!
Jubilee Hills: శ్రీనగర్ కాలనీలోని ఇండియన్ బ్యాంక్ గల్లీలో డ్రైనేజీ నీరు పొంగిపొర్లుతున్న సమస్యను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు పరిశీలించారు.
స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే గారు, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులతో మాట్లాడారు.
డ్రైనేజీ సమస్యను తక్షణమే పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే గారు, నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను పరిష్కారం చూపేందుకు కృషి చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.