Hyderabad: ఎల్బీనగర్ కూడలిలో ఘోర ప్రమాదం బస్సు కింద నలిగిన విద్యార్థి కాళ్లు!
Hyderabad: హైదరాబాద్ ఎల్బీనగర్ కూడలిలో ఘోర రోడ్డు ప్రమాదం. బైక్ అదుపుతప్పడంతో విద్యార్థిపై నుంచి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు. తీవ్ర గాయాలతో పరిస్థితి విషమం.
Hyderabad: ఎల్బీనగర్ కూడలిలో ఘోర ప్రమాదం బస్సు కింద నలిగిన విద్యార్థి కాళ్లు!
Hyderabad: హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ కూడలిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తండ్రితో కలిసి బైక్‌పై స్కూల్‌కు వెళ్తున్న విద్యార్థి ప్రమాదానికి గురైంది. ఒక్కసారిగా బైక్ అదుపుతప్పి తండ్రి, డ్రి, కుమారుడు రోడ్డుపై పడిపోయారు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు విద్యార్థి కాళ్లపై నుంచి దూసుకెళ్లింది. దీంతో విద్యార్థి కాళ్లు బస్సు చక్రాల కింద నలిగిపోయి తీవ్ర గాయాలయ్యాయి.
పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.