Hyderabad: హైదరాబాద్‌లో రూ. లక్ష విలువైన ఢిల్లీ మద్యం పట్టివేత!
Hyderabad: ఢిల్లీ నుండి మద్యం తెచ్చి హైదరాబాద్‌లో అమ్ముతున్న వ్యక్తిని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసి, రూ. లక్ష విలువైన 41 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
Hyderabad: హైదరాబాద్‌లో రూ. లక్ష విలువైన ఢిల్లీ మద్యం పట్టివేత!
Hyderabad: ఢిల్లీలో ఖరీదైన మద్యం బాటిళ్లను తక్కువ ధరలకు తీసుక వచ్చిన హైదరాబాద్ అవసరమున్న వారికి డోర్ డెలీవరీ చేస్తున్న వ్యక్తిని హైదరాబాద్ ఎన్‌ఫోర్‌మెంట్ టీమ్ ట్రేనీ ఏఈఎస్ చిరంజీవి, సీఐ చంద్రశేఖర్ గౌడ్ సిబ్బంది పట్టుకున్నారు.
కూకట్‌పల్లి ప్రాంతానికి చెందిన సి.హెచ్. మహేష్ కుమార్(34) అనే వ్యక్తి వారానికి ఒకమారు ఢిల్లీకి రైళ్లి నాలుగు పెట్టల మద్యాన్ని తీసుకొని వచ్చి హైదరాబాద్‌లో అమ్మకాలు జరుపుతూ మద్యం బాటిల్‌పై రూ.600 అధికంగా తీసుకుంటు అమ్మకాలు జరుపుతూ సొమ్ము చేసుకుంటున్నాడు.
ఈ సమాచారం అందుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్ ఏఈఎస్, సీఐ, ఎస్సై శ్రీనివాస్,అల్జల్,శశిధర్, శంకర్, జంగయ్యలు కలిసి ఫిడ్‌డోజ్ హోటల్, ప్రేమ్‌నగర్ ఎర్రగడ్డ ప్రాంతంలో పట్టుకున్నారు. నిందితుడి వద్ద 41 మద్యం బాటిళ్లను, ఒక స్కూటీ స్వాధీనం చేసుకున్నారు.
పట్టుకున్న మద్యం బాటిల్లలో జానీవాకర్ తోపాటు ఇతర బాటిళ్లు పట్టుకున్న మద్యం విలువ రూ. లక్ష మేరకు ఉంటుందని అంచనా వేశారు. నిందితుడిని మద్యాన్ని బంజరాహీల్స్ ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించారు.