Hyderabad: పల్స్ ఫార్మా నానో-విటమిన్ D3కి కీలక ఆమోదం!
Hyderabad: హైదరాబాద్‌కు చెందిన పల్స్ ఫార్మాస్యూటికల్స్ అభివృద్ధి చేసిన ప్రపంచంలోనే మొట్టమొదటి నానో-క్యారియర్ విటమిన్ D3 ఓరల్ డిస్పర్షన్‌కు నియంత్రణ సంస్థల ఆమోదం లభించింది.
Hyderabad: పల్స్ ఫార్మా నానో-విటమిన్ D3కి కీలక ఆమోదం!
హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న పల్స్ ఫార్మాస్యూటికల్స్‌కు కీలక విజయం లభించింది. సంస్థ అభివృద్ధి చేసిన నానో-క్యారియర్ ఆధారిత విటమిన్ D3 ఓరల్ డిస్పర్షన్‌కు నియంత్రణ సంస్థ ఆమోదం లభించింది. ప్రపంచంలోనే ఈ తరహా నానో-క్యారియర్ విటమిన్ D3 ఉత్పత్తికి ఇదే తొలి ఆమోదమని సంస్థ తెలిపింది.
క్లినికల్ అధ్యయనాల్లో సంప్రదాయ ఫార్ములేషన్లతో పోలిస్తే సీరం విటమిన్ D స్థాయిలు 50 నుంచి 60 శాతం అధికంగా ఉన్నట్లు వెల్లడైందని పేర్కొంది. విటమిన్ D3తో పాటు విటమిన్ K2-7, B12, ఐరన్ తదితర పోషకాలు, పలు సాధారణ ఔషధాలపై కూడా తమ నానో టెక్నాలజీని విస్తరిస్తున్నట్లు సంస్థ తెలిపింది. భారత్‌తో పాటు అమెరికా, రష్యా, మెక్సికో, ఆస్ట్రేలియాలో పేటెంట్లు కలిగి ఉన్న పల్స్ ఫార్మాస్యూటికల్స్.. ప్రపంచ మార్కెట్లలో విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.