Khairatabad: ఖైరతాబాద్‌లో విద్యుత్ సమస్యల పరిష్కారానికి MGR వినతి!

Khairatabad: విద్యుత్ సమస్యలు, పోల్స్ షిఫ్టింగ్ తదితర అంశాల పరిష్కారం కోసం బీఆర్ఎస్ ఇన్‌చార్జ్ MGR హైదరాబాద్ సెంట్రల్ ఆపరేషన్స్ ఎస్‌ఈ రమేష్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

Update: 2026-08-20 10:35 GMT

Khairatabad: ఖైరతాబాద్‌లో విద్యుత్ సమస్యల పరిష్కారానికి MGR వినతి!

ఖైరతాబాద్: సమస్యలపై సమరంలో భాగంగా ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్లలో నెలకొన్న విద్యుత్ సమస్యలు, విద్యుత్ పోల్స్ షిఫ్టింగ్ తదితర సమస్యల పరిష్కారం కోసం ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మన్నే గోవర్ధన్ రెడ్డి (MGR) హైదరాబాద్ సెంట్రల్ ఆపరేషన్ సూపర్డెంట్ ఇంజనీర్ రమేష్ గారిని కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ డివిజన్లలో ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్ సంబంధిత సమస్యలను SE రమేష్ గారి దృష్టికి MGR తీసుకెళ్లారు. ముఖ్యంగా ఖైరతాబాద్ డివిజన్ బీజేఆర్ నగర్‌లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మరియు పోల్స్ షిఫ్టింగ్, న్యూ సిబిఐ క్వార్టర్స్‌లో ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ ఫినిషింగ్ పనులు, అవసరమైన చోట్ల కరెంట్ పోల్స్ షిఫ్టింగ్, ఐరన్ పోల్స్ స్థానంలో సిమెంట్ విద్యుత్ పోల్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని వివరించారు.

ప్రజల భద్రతకు ఇబ్బంది కలిగించే విద్యుత్ పోల్స్ సమస్యలను వెంటనే పరిష్కరించి, అన్ని డివిజన్లలో పెండింగ్‌లో ఉన్న విద్యుత్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని MGR కోరారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా SE రమేష్ గారు సమస్యలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ డివిజన్ మాజీ అధ్యక్షులు గజ్జల ఆనంద్, శ్యామ్ గౌడ్, అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News