Hyderabad: వట్టే జానయ్య యాదవ్ ఆచూకీ తెలపాలి యాదవ సంఘం డిమాండ్
Hyderabad: సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో తెలంగాణ యాదవ హక్కుల పోరాట సమితి మీడియా సమావేశం. వట్టే జానయ్య యాదవ్ ఆచూకీ తెలపాలని పోలీసులను డిమాండ్ చేసిన రాములు యాదవ్.
Hyderabad: వట్టే జానయ్య యాదవ్ ఆచూకీ తెలపాలి యాదవ సంఘం డిమాండ్
హైదరాబాద్: వట్టే జానయ్య యాదవ్ ఆచూకీ తెలియజేయాలని తెలంగాణ యాదవ హక్కుల పోరాట సమితి పోలీస్ శాఖను డిమాండ్ చేశారు.
సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోరాట సమితి అధ్యక్షుడు రాములు యాదవ్ మాట్లాడారు.
నల్లగొండ జిల్లాలో బీసీల పట్ల తీవ్ర వివక్ష కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. యాదవుల పట్ల రాజకీయ వేధింపులు కొనసాగుతున్నాయని అన్నారు.
జానయ్య తప్పు చేసి ఉంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కానీ ఇలా వేధింపులకు గురి చేయటం ఏమిటని ప్రశ్నించారు.
అగ్రకులాలకు చెందిన రైస్ మిల్లర్ల పట్ల ప్రభుత్వం ఇదే తీరులో వ్యవహరిస్తుందా అని నిలదీశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని జానయ్య ఆచూకీ చెప్పాలా పోలీస్ శాఖను ఆదేశించాలని డిమాండ్ చేశారు.