Hyderabad: మంత్రి వివేక్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న విద్యార్థి జగన్
Hyderabad: పీఆర్‌ఎస్‌ఐ ఆధ్వర్యంలో అవార్డు అందుకున్న జగన్. జర్నలిజంలో అత్యధిక మార్కులు సాధించినందుకు మంత్రి వివేక్ చేతుల మీదుగా సత్కారం.
Hyderabad: మంత్రి వివేక్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న విద్యార్థి జగన్
హైదరాబాద్: నేషనల్ పబ్లిక్ రిలేషన్స్ ఎడ్యుకేషన్ డే సందర్భంగా పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (PRSI), CVN పబ్లిక్ రిలేషన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో Meritorious Student Recognition అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర పరిశ్రమ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరై ప్రతిభావంతులైన విద్యార్థులను అవార్డులతో సత్కరించారు.
సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో (2023-2025) బ్యాచ్ లో ఎంఏ జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్ విభాగంలో పబ్లిక్ రిలేషన్స్ సబ్జెక్టులో అత్యధిక మార్కులు సాధించినందుకు సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం బాచుపల్లి ప్రాంగణానికి చెందినటువంటి విద్యార్థి జగన్ ఈ అవార్డుకు ఎంపిక అయ్యాడు.
జగన్ స్వస్థలం నల్గొండ జిల్లా నెర్మట గ్రామం...అవార్డుకు ఎంపికైన బొమ్మరగోని జగన్ Meritorious Student Recognition అవార్డు మంత్రి వివేక్ చేతుల మీదుగా అందుకున్నాడు.. ఈ అవార్డు రావడం పట్ల జగన్ సంతోషం వ్యక్తం చేశారు. జగన్ కి ఈ అవార్డు రావడంతో తోటి విద్యార్థులు అభినందించారు..