Vikarabad: మండల ప్రజావాణికి అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలి కలెక్టర్

Vikarabad: వికారాబాద్ కలెక్టరేట్‌లో కలెక్టర్ దీపక్ తివారి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు.

Update: 2026-08-07 14:24 GMT

Vikarabad: మండల ప్రజావాణికి అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలి కలెక్టర్

వికారాబాద్: ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్ల చేయాలనీ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి జిల్లా అధికారులకు ఆదేశించారు. శుక్రవారం కలెక్టరెట్ కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరేడ్ గ్రౌండ్ లో టెంట్ల ఏర్పాటు, వీఐపీ సీటింగ్, ప్రధాన వేదిక ఏర్పాటు, అధికారులు, ప్రజాప్రతినిధుల సీటింగ్ ఏర్పాటు, పరేడ్ నిర్వహణ విధానం, కార్యక్రమాల ప్రారంభ క్రమం, వివిధ శాఖల స్టాళ్ల ఏర్పాటు, విద్యుత్, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలనీ , అధికారులకు ఆదేశించారు. గత ఏడాది చేపట్టిన ఏర్పాట్లను సమీక్షించిన కలెక్టర్, అవసరమైన చోట మార్పులు చేసి ఈసారి మరింత మెరుగైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.

వర్షం కురిసే అవకాశం ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో కూడిన ముందస్తు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి, అవసరమైన ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. వివిధ శాఖ లలో పెండింగ్ ఉన్న సి ఎం ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పూర్తి చేయాలనీ అధికారులకు ఆదేశించారు.

ప్రభుత్వం జీ ఓ ఎం ఎస్ నెంబర్ 4 విడుదల చేసిందని, ఈ జి ఓ ద్వారా మండల స్థాయి ప్రజావాణి నిర్వ్వహించాలని ఆదేశించారు. ప్రతి మండలం లో మండల ప్రజావాణి కార్యక్రమానికి మండల స్థాయి అధికారులు అందరు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. సమావేశం లో అదనపు కలెక్టర్ లు ఉమా శంకర్ ప్రసాద్, వెంకటాచారి, అటవీ శాఖ అధికారి విశాల్ బత్తుల, డి.ఆర్.డి.ఓ. శ్రీనివాస్, ఎ.ఓ ఫర్ హీన బేగం వివిధ శాఖ ల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News