Tarnaka: తార్నాకలో 'హర్ ఘర్ తిరంగా' ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి!

Tarnaka: ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా బీజేపీ రాష్ట్ర నాయకులు రామచందర్‌రావు నివాసంపై జాతీయ జెండాను ఎగురవేశారు.

Update: 2026-08-10 05:39 GMT

Tarnaka: తార్నాకలో 'హర్ ఘర్ తిరంగా' ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి!

Tarnaka: ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న ‘హర్‌ ఘర్‌ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు సోమవారం తార్నాకలోని తన నివాసం వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఇంటిపైనా జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు.జాతీయ జెండా ప్రతి భారతీయుడి ఆత్మగౌరవానికి, దేశభక్తికి, జాతీయ ఐక్యతకు ప్రతీక అని రామచందర్‌రావు పేర్కొన్నారు.

‘హర్‌ ఘర్‌ తిరంగా’ కార్యక్రమాన్ని ప్రజలు పెద్ద ఎత్తున నిర్వహించి దేశభక్తి స్ఫూర్తిని చాటాలని కోరారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆగస్టు 14న ట్యాంక్‌బండ్‌ వద్ద నిర్వహించనున్న భారీ తిరంగా ర్యాలీలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Tags:    

Similar News