Malkajgiri: తమిళనాడులో మల్కాజిగిరి వాసి మృతి ఆదుకున్న మైనంపల్లి!
Malkajgiri: తమిళనాడులో గుండెపోటుతో మృతి చెందిన మల్కాజిగిరి వాసి. సొంత ఖర్చులతో అంబులెన్స్ ఏర్పాటు చేసిన మైనంపల్లి హనుమంతరావు.
Malkajgiri: తమిళనాడులో మల్కాజిగిరి వాసి మృతి ఆదుకున్న మైనంపల్లి!
Malkajgiri: కాకతీయనగర్‌కు చెందిన నెల్సన్ పాల్ తమిళనాడులోని వేలాంకన్నీ చర్చి సమీపంలో గుండెపోటుతో మృతి చెందారు.విషయం తెలుసుకున్న మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు స్పందించి,తమిళనాడు ప్రభుత్వ కలెక్టర్‌తో మాట్లాడి మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.
మైనంపల్లి హనుమంతరావు స్వంత ఖర్చులతో అంబులెన్స్‌ను ఏర్పాటు చేసి,నెల్సన్ పాల్ పార్థివదేహాన్ని కాకతీయనగర్‌లోని ఆయన స్వగృహానికి తరలించేలా చర్యలు తీసుకున్నారు. కుటుంబ సభ్యులకు అండగా నిలిచి,ఆపత్కాలంలో సహాయం అందించిన హనుమంతరావు చర్యలను స్థానికులు అభినందించారు.