Malkajgiri: ఢిల్లీ మహా ధర్నాకు బయలుదేరిన మల్కాజిగిరి సీపీఐ నాయకులు
Malkajgiri: ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో సెప్టెంబర్ 1న జరగనున్న సీపీఐ మహా ధర్నాలో పాల్గొనేందుకు మల్కాజిగిరి సీపీఐ నాయకులు ఆదివారం రాత్రి ఢిల్లీకి బయలుదేరారు.
Malkajgiri: ఢిల్లీ మహా ధర్నాకు బయలుదేరిన మల్కాజిగిరి సీపీఐ నాయకులు
మల్కాజిగిరి: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీపీఐ జాతీయ సమితి పిలుపునిచ్చిన “బద్లావ్ జరూరీ హై.. మార్పు కావాలి” మహా ధర్నాలో పాల్గొనేందుకు మల్కాజిగిరి సీపీఐ మండల నాయకులు ఢిల్లీకి బయలుదేరారు. సెప్టెంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో లక్షలాది మందితో మహా ధర్నా నిర్వహించనున్న నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి ఆదివారం రాత్రి 11 గంటలకు దక్షిణ్ ఎక్స్‌ప్రెస్‌లో నాయకులు ఢిల్లీకి పయనమయ్యారు.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ఈ మహా ధర్నాను విజయవంతం చేయాలని సీపీఐ నాయకులు పిలుపునిచ్చారు. దేశంలో ప్రజాస్వామ్య, లౌకిక,సామాజిక న్యాయ పరిరక్షణ కోసం ప్రజలు పెద్దఎత్తున ఉద్యమాల్లో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఢిల్లీ మహా ధర్నాలో పాల్గొనేందుకు మల్కాజిగిరి సీపీఐ మండల నాయకులు జె. వెంకటరమణ,ఎస్.కె. అజీజ్,బి. రాములు, ఎం. వెంకటేష్,టి. రాములు గౌడ్,పి. శ్రీశైలం యాదవ్,బి. అనసూర్య, జె.ఈరమ్మ తదితరులు బయలుదేరి వెళ్లారు.