Malkajgiri: మల్కాజిగిరిలో పింఛన్ల దరఖాస్తులు అందజేసిన నర్సింహ యాదవ్

Malkajgiri: మల్కాజిగిరి పరిధిలో అర్హులైన వారికి పింఛన్లు మంజూరు చేయాలని కోరుతూ మాజీ కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్ డిప్యూటీ కమిషనర్‌కు దరఖాస్తులు అందజేశారు.

Update: 2026-08-31 12:59 GMT

Malkajgiri: మల్కాజిగిరిలో పింఛన్ల దరఖాస్తులు అందజేసిన నర్సింహ యాదవ్

మల్కాజిగిరి: మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 262, 264 డివిజన్లలో అర్హులైన వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ప్రభుత్వ పింఛన్లు మంజూరు చేయాలని కోరుతూ, వారి పింఛన్ దరఖాస్తులను డిప్యూటీ కమిషనర్ కు ఓల్డ్ బోయిన్ పల్లి మాజీ కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్ స్వయంగా సమర్పించారు.

సుమారు 350 మంది పేద, అర్హులైన లబ్ధిదారులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రభుత్వ పథకాల కోసం ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో, ముద్దం నర్సింహ యాదవ్ గారు తన సొంత ఖర్చులతో వారి పింఛన్ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేయించి, అవసరమైన ప్రక్రియను పూర్తి చేయించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ262, 264 డివిజన్లలో పింఛన్‌కు అర్హత ఉన్నప్పటికీ ఇంకా పింఛన్ అందని వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళల దరఖాస్తులను సంబంధిత అధికారులకు అందజేశామని తెలిపారు. దరఖాస్తులను పరిశీలించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ త్వరితగతిన ఆమోదం కల్పించి పింఛన్ మంజూరు చేయాలని డిప్యూటీ కమిషనర్ ను కోరినట్లు తెలిపారు.

Tags:    

Similar News