Flower farming: నష్టాల వ్యవసాయానికి గుడ్ బై చెప్పండి.. బంతి, గులాబీ తోటలతో నెలకు లక్షన్నర సంపాదన!

Flower farming: సాంప్రదాయ పంటలతో నష్టపోతున్న రైతులకు పూల సాగు ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయంగా మారింది.

Update: 2026-05-21 08:46 GMT

Flower farming: నష్టాల వ్యవసాయానికి గుడ్ బై చెప్పండి.. బంతి, గులాబీ తోటలతో నెలకు లక్షన్నర సంపాదన!

Flower Cultivation: పెట్టుబడి పెరిగి.. రాబడి తగ్గి.. ఎకరం పొలంలో చెమటోడ్చి పనిచేసినా చివరకు చేతిలో చిల్లిగవ్వ మిగలని పరిస్థితి నేడు చాలా మంది రైతులది. వ్యవసాయం అంటేనే నష్టాల సాగు అనే నిరాశలో ఉన్న అన్నదాతలకు ఒక సరికొత్త ఆశాకిరణం కనిపిస్తోంది. సాంప్రదాయ పంటల వెనుకే పరిగెత్తకుండా, కొద్దిగా ఆలోచన మార్చి, తక్కువ భూమిలో ఎక్కువ లాభాలు ఇచ్చే ప్రత్యామ్నాయ పంటల వైపు అడుగులు వేస్తే అద్భుతాలు సృష్టించవచ్చని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం ఎకరాల కొద్దీ విస్తీర్ణం అవసరం లేదు, కేవలం అర ఎకరం భూమి ఉంటే చాలు, బంగార లాంటి లాభాల పంట పండించవచ్చు.

తక్కువ భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతులకు అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే మార్గాల్లో పూల సాగు సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. తక్కువ పెట్టుబడితో, అతి తక్కువ కాలంలోనే చేతికి డబ్బులు అందించడం పూల తోటల ప్రత్యేకత. కేవలం అర ఎకరం భూమిలో బంతి, చామంతి, గులాబీ వంటి పూలను సాగు చేయడం ద్వారా రైతులు ఊహించని లాభాలను అందుకుంటున్నారు. పైగా ఒకే రకమైన పంట కాకుండా, పంట మార్పిడి పద్ధతిని పాటించడం వల్ల భూమి సారం పెరగడమే కాకుండా, తదుపరి పంటల్లో దిగుబడి కూడా అద్భుతంగా వస్తుంది. సాధారణంగా పూల సాగు అనేది ఎంచుకున్న రకాన్ని బట్టి కేవలం రెండు నెలల నుంచి ఆరు నెలల లోపే పూర్తవుతుంది. అంటే తక్కువ కాలంలోనే పెట్టుబడి తిరిగి రావడంతో పాటు లాభాలు కూడా చేతికందుతాయి.

ఈ పూల సాగులో నాణ్యమైన దిగుబడి సాధించాలంటే రసాయన ఎరువుల కంటే సహజ సిద్ధమైన పశువుల ఎరువులు, సేంద్రియ పద్ధతులను వాడటం ఎంతో మేలని నిపుణులు సూచిస్తున్నారు. స్థానిక వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు తీసుకుంటూ సాగును పర్యవేక్షిస్తే తక్కువ శ్రమతో ఎక్కువ పంటను సాధించవచ్చు. మన దేశంలో పండుగలు, పెళ్లిళ్లు, రాజకీయ సభలు, దైవ కార్యక్రమాలకు కొరత లేదు. అందుకే ఏడాది పొడవునా, ముఖ్యంగా శుభకార్యాల సీజన్లలో పువ్వులకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. వాణిజ్యపరంగా చూసుకుంటే ఇతర సాధారణ పంటల కంటే పూల సాగు ఎన్నో రెట్లు లాభదాయకంగా ఉంటోంది. స్థానిక మార్కెట్లే కాకుండా ఇతర ప్రాంతాలకు, అవసరమైతే విదేశాలకు కూడా ఎగుమతి చేయడం ద్వారా రైతులు భారీగా ఆర్జిస్తున్నారు.

కేవలం పువ్వులను కోసి మార్కెట్లో అమ్మడమే కాకుండా, కొద్దిగా వినూత్నంగా ఆలోచించి విలువ జోడింపు అంటే వాల్యూ ఎడిషన్ చేయడం ద్వారా ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. పువ్వులను అందమైన గిఫ్ట్ బొకేలుగా మార్చడం, పెళ్లిళ్లకు కావాల్సిన అలంకరణ వస్తువులు, దండలుగా తయారు చేసి నేరుగా కస్టమర్లకు అమ్మడం ద్వారా మధ్యవర్తుల దోపిడీని అరికట్టి పూర్తి లాభాన్ని రైతులే పొందవచ్చు. ఈ రోజుల్లో సాంప్రదాయ పద్ధతులతో పాటు ఆధునిక సాంకేతికతను జోడించి గ్రీన్ హౌస్ సాగు లేదా హైడ్రోపోనిక్స్ వంటి సరికొత్త విధానాలను ఉపయోగించడం ద్వారా వాతావరణ మార్పులను తట్టుకుని మరీ ఏడాది పొడవునా నాణ్యమైన పూలను పండించే అవకాశం ఉంది. అయితే పూల సాగులో చీడపీడలు, అకస్మాత్తుగా మారే వాతావరణ పరిస్థితులు కొంతవరకు సవాలు విసురుతాయి కాబట్టి, వాటిపై ముందే అవగాహన పెంచుకోవాలి.

ఇక పెట్టుబడి , లాభాల విషయానికి వస్తే, వ్యవసాయ నిపుణుల లెక్కల ప్రకారం బంతి పూల సాగుకు అర ఎకరా స్థలానికి సుమారు ఇరవై వేల రూపాయల వరకు మాత్రమే ఖర్చవుతుంది. కానీ మార్కెట్ బాగుంటే దీని ద్వారా లక్ష రూపాయల నుండి లక్షన్నర రూపాయల వరకు నికర ఆదాయం లభిస్తుంది. అదేవిధంగా గులాబీ సాగు విషయానికి వస్తే, దీనికి దాదాపు యాభై వేల రూపాయల వరకు పెట్టుబడి అవుతుంది. అయినప్పటికీ, మార్కెట్లో గులాబీలకు ఉన్న డిమాండ్ కారణంగా సులభంగా లక్షన్నర రూపాయల వరకు రాబడిని అందుకోవచ్చు.

Tags:    

Similar News