TG 10th Class Results 2026: పదో తరగతి విద్యార్థులకు అలెర్ట్.. రేపు మధ్యాహ్నమే ఫలితాలు..!
TG 10th Class Results 2026: తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలు రేపు (ఏప్రిల్ 29) మధ్యాహ్నం 2 గంటలకు విడుదల కానున్నాయి. మార్చిలో జరిగిన ఈ పరీక్షలకు 5.15 లక్షల మంది విద్యార్థులు హాజరుకాగా, రికార్డు స్థాయిలో మూల్యాంకనం పూర్తి చేసి విద్యాశాఖ ఫలితాలను వెల్లడిస్తోంది.
TG 10th Class Results 2026: పదో తరగతి విద్యార్థులకు అలెర్ట్.. రేపు మధ్యాహ్నమే ఫలితాలు..!
TG 10th Class Results 2026: తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షా ఫలితాల విడుదలకు కౌంట్‌డౌన్ మొదలైంది. రేపు (ఏప్రిల్ 29, బుధవారం) మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలను అధికారికంగా విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం వెల్లడించింది. విద్యాశాఖ ఉన్నతాధికారులతో కలిసి ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు.
ఈ ఏడాది మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 వరకు జరిగిన పదో తరగతి ప్రధాన పరీక్షలకు సుమారు 5.15 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షలు ముగిసిన కొద్ది రోజుల్లోనే, అంటే ఈ నెల 23వ తేదీ నాటికే జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియను విద్యాశాఖ విజయవంతంగా పూర్తి చేసింది.
సాధారణంగా మే మొదటి వారంలో ఫలితాలు వస్తాయని అందరూ భావించినప్పటికీ, విద్యాశాఖ యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసి ఏప్రిల్ 29నే ఫలితాలను వెల్లడించేందుకు సిద్ధమైంది. ఫలితాల విడుదల అనంతరం విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ ద్వారా అధికారిక వెబ్‌సైట్లలో మార్కుల వివరాలను చూసుకోవచ్చు.