Telangana 10th Class Results 2026: తెలంగాణ టెన్త్ ఫలితాలపై బిగ్ అప్‌డేట్.. ఫలితాలు ఎప్పుడంటే..?
Telangana 10th Class Results 2026: తెలంగాణ పదో తరగతి ఫలితాల అప్‌డేట్: మే మొదటి వారంలో టెన్త్ రిజల్ట్స్ వచ్చే అవకాశం. ఏప్రిల్ 25 నాటికి ముగియనున్న మూల్యాంకన ప్రక్రియ. పూర్తి వివరాలు ఇక్కడ.
Telangana 10th Class Results 2026: తెలంగాణ టెన్త్ ఫలితాలపై బిగ్ అప్‌డేట్.. ఫలితాలు ఎప్పుడంటే..?
Telangana 10th Class Results 2026: తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు ఎదురుచూస్తున్న ఫలితాల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 16వ తేదీకే ప్రధాన సబ్జెక్టుల మూల్యాంకనం పూర్తికాగా, మిగిలిన ప్రక్రియను కూడా వేగంగా ముగించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే మే మొదటి వారంలోనే ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.
తొలి విడత మూల్యాంకనం విజయవంతంగా ముగిసింది. ప్రస్తుతం సైన్స్, సోషల్ సబ్జెక్టుల జవాబు పత్రాల మూల్యాంకనంతో పాటు స్కానింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రక్రియను ఈ నెల 25వ తేదీలోపు పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. మూల్యాంకనం పూర్తయిన వెంటనే విద్యార్థుల మార్కులను సేకరించి, ట్యాబ్యులేషన్ (మార్కుల నమోదు) ప్రక్రియను ప్రారంభించనున్నారు.
ఫలితాల ప్రకటనలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేదా మార్కుల నమోదులో పొరపాట్లు జరగకుండా అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ ప్రక్రియలన్నీ వేగవంతం చేసి, మే 4 లేదా 5వ తేదీల్లో తుది ఫలితాలను విడుదల చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.