Sircilla: ఘోర ప్రమాదం: పొలం దున్నుతూ ట్రాక్టర్ కిందపడి యువ రైతు మృతి!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా రేపాకలో విషాదం. కేజీవీల్ ట్రాక్టర్‌తో పొలం దున్నుతుండగా ప్రమాదవశాత్తు బురదలో పడి యువ రైతు రోండ్ల చంద్రశేఖర్ రెడ్డి (25) మృతి.
Sircilla: ఘోర ప్రమాదం: పొలం దున్నుతూ ట్రాక్టర్ కిందపడి యువ రైతు మృతి!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా మండలం రేపాక గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన యువ రైతు రోండ్ల చంద్రశేఖర్ రెడ్డి (25) తన సొంత పొలంలో కేజీవీల్ ట్రాక్టర్‌తో దున్నుతున్న సమయంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌పై నుంచి బురదలో పడిపోయాడు.
ఈ ప్రమాదాన్ని గమనించిన మృతుడి తండ్రి, సమీపంలోని ఇతర రైతులు వెంటనే అతడిని బయటకు తీసి సీపీఆర్ నిర్వహించినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పటికే చంద్రశేఖర్ రెడ్డి మృతి చెందినట్లు తెలిసింది.
యువ రైతు అకాల మరణంతో రేపాక గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.