Gollaprolu: గొల్లప్రోలు మాజీ కౌన్సిలర్ భర్త దారుణ హత్య
Gollaprolu: కాకినాడ జిల్లా గొల్లప్రోలులో మాజీ కౌన్సిలర్ భర్త లింగం అర్జునుడి హత్య. వాటర్ ఫాల్స్ వద్ద మొదలైన గొడవ. నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులు.
Gollaprolu: గొల్లప్రోలు మాజీ కౌన్సిలర్ భర్త దారుణ హత్య
గొల్లప్రోలు: కాకినాడ జిల్లా, గొల్లప్రోలు పోలీస్ స్టేషన్, పిఠాపురం సర్కిల్ గొల్లప్రోలు నగర పంచాయతీ పరిధిలో హత్య దారపల్లి వాటర్ ఫాల్స్ వద్ద జరిగిన ఘర్షణే హత్యకు కారణం. నిందితుడిపై గొల్లప్రోలు పోలీస్ స్టేషన్‌లో హత్య కేసు నమోదు, దర్యాప్తు కొనసాగుతోంది.
ఘటన వివరాలు:
ప్రాథమిక సమాచారం మేరకు, తేదీ 14-07-2026 న గొల్లప్రోలు నగర పంచాయతీ రెండవ వార్డు మాజీ కౌన్సిలర్ భర్త లింగం అర్జునుడు తన స్నేహితులతో కలిసి దారపల్లి వాటర్ ఫాల్స్‌కు విహారయాత్రకు వెళ్లారు.
ఈ సందర్భంగా అక్కడ బచ్చల మారుతి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తితో మాటామాటా పెరిగి ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం తిరిగి వచ్చిన తర్వాత కూడా అదే విషయమై సాయంత్రం మరోసారి వారి మధ్య ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా స్నేహితులు జోక్యం చేసుకొని ఇద్దరినీ సముదాయించి, ఎవరింటికి వారిని పంపించారు.
అయితే, ఉదయం నుంచి జరిగిన ఘర్షణను మనసులో పెట్టుకున్న *బచ్చల మారుతి పవన్ కళ్యాణ్ అర్జునుడిని హత్య చేయాలనే ఉద్దేశంతో క్షమాపణ చెప్పే నెపంతో అతని ఇంటి వద్దకు వెళ్లాడు. అనంతరం తన వెంట తీసుకెళ్లిన పదునైన చాకుతో లింగం అర్జునుడి కడుపులో పొడవడంతో ఆయనకు తీవ్ర రక్తస్రావం జరిగింది.
గాయపడిన లింగం అర్జునుడిని స్థానికులు వెంటనే కార్తికేయ ఆసుపత్రి, పిఠాపురంకు తరలించగా, వైద్యులు చికిత్స అందించినప్పటికీ అదే రోజు రాత్రి 10:45 గంటలకు ఆయన మృతి చెందారు.
పోలీసు చర్యలు:
ఈ ఘటనపై గొల్లప్రోలు పోలీస్ స్టేషన్‌లో Cr.No. 112/2026 గా భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సంబంధిత సెక్షన్ల కింద హత్య కేసు నమోదు చేయబడింది. నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు చర్యలు చేపట్టాయి. కేసుకు సంబంధించిన అన్ని కోణాల్లో సాక్ష్యాధారాలను సేకరిస్తూ సమగ్ర దర్యాప్తు కొనసాగుతోంది.