Madanapalle: మదనపల్లె కలెక్టరేట్ ఎదుట ట్రాన్స్‌జెండర్ ఆత్మహత్యాయత్నం

Madanapalle: రూ. 6 కోట్లు మోసం చేశారంటూ మదనపల్లె కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్యాయత్నం చేసిన ట్రాన్స్‌జెండర్ స్వాతి. స్పందించి అడ్డుకున్న పోలీసులు.

Update: 2026-08-24 09:08 GMT

Madanapalle: మదనపల్లె కలెక్టరేట్ ఎదుట ట్రాన్స్‌జెండర్ ఆత్మహత్యాయత్నం

Madanapalle: మదనపల్లె, అన్నమయ్య జిల్లా: మదనపల్లె కలెక్టరేట్ ఎదుట సోమవారం ట్రాన్స్‌జెండర్ స్వాతి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. చీకిలగుట్టకు చెందిన స్వాతి తనకు న్యాయం చేయాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు. తన వద్ద నుంచి డమేరేశ్వర్ దంపతులు రూ.6 కోట్ల నగదు, బంగారం తీసుకుని మోసం చేశారని ఆమె ఆరోపించారు. ఈ విషయంపై ఇప్పటికే పోలీసులకు, అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో స్వాతి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా అప్రమత్తమైన పోలీసులు వెంటనే అడ్డుకున్నారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ పోలీసుల కాళ్లకు మొక్కుతూ ఆమె వేడుకున్నారు. దీంతో కలెక్టరేట్ పరిసరాల్లో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకుని ఆమెను అక్కడి నుంచి తరలించారు. బాధితురాలి ఫిర్యాదుపై విచారణ జరిపి న్యాయం చేయాలని ఆమె కోరారు.

Tags:    

Similar News