Madanapalle: రామసముద్రం మండలంలో దారుణం పాము కాటుతో మహిళ మృతి!

Madanapalle: అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలంలో పాము కాటుకు గురై నారాయణమ్మ (58) అనే మహిళ మృతి చెందింది. పొలంలో పని చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Update: 2026-08-23 07:43 GMT

Madanapalle: రామసముద్రం మండలంలో దారుణం పాము కాటుతో మహిళ మృతి!

Madanapalle: పాము కాటుతో 58 ఏళ్ల మహిళ మృతి చెందిన ఘటన రామసముద్రం మండలంలో చోటుచేసుకుంది. మాలేనత్తం గ్రామపంచాయతీ పరిధిలోని ఉప్పినెల్లి గ్రామానికి చెందిన నారాయణమ్మ శనివారం పొలంలో వ్యవసాయ పనులు చేస్తుండగా పాము కాటు వేసింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను పుంగనూరు ఆసుపత్రికి తరలించారు.

పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం నారాయణమ్మ మృతి చెందింది. ఈ ఘటనపై ఎస్సై హృషికేశవ రెడ్డి వివరాలు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News