Madanapalle: 44 ఏళ్లుగా టీడీపీకి సేవ.. వైస్ చైర్మన్ పదవి ఇవ్వండి

మదనపల్లె: మదనపల్లె మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన నేపథ్యంలో తనకు మున్సిపల్ వైస్ చైర్మన్‌గా అవకాశం కల్పించాలని 34వ వార్డు కౌన్సిలర్ బోయపాటి రంగస్వామి నాయుడు పార్టీ అధిష్ఠానాన్ని కోరారు. గత 44 సంవత్సరాలుగా ఎలాంటి స్వార్థం లేకుండా, పదవులను ఆశించకుండా తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తున్నట్లు తెలిపారు.

పదవుల కంటే పార్టీ సేవకే ప్రాధాన్యత ఇస్తూ నాలుగు దశాబ్దాలకు పైగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నానని పేర్కొన్నారు. తనలాంటి సీనియర్ నాయకుల సేవలను పార్టీ అధిష్ఠానం గుర్తించి తగిన గౌరవం, సముచిత అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

మదనపల్లె మున్సిపల్ వైస్ చైర్మన్‌గా అవకాశం కల్పిస్తే ప్రజలకు మరింత చేరువగా ఉంటూ సేవలందించడంతో పాటు పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. పదవులు శాశ్వతం కాదని, ప్రజలకు చేసిన సేవలే శాశ్వతమని పేర్కొంటూ 44 ఏళ్ల పార్టీ సేవకు తగిన గుర్తింపు ఇవ్వాలని బోయపాటి రంగస్వామి నాయుడు కోరారు.

Tags: