Chittoor: చిత్తూరు జిల్లాను అభివృద్ధి చేయడం ధ్యేయంగా కృషి చేస్తా: శైలజ!

పూతలపట్టు: పూతలపట్టు మండల జెడ్పిటిసి సభ్యురాలుగా శైలజ తేజ మూర్తి ఏకగ్రీవంగా ఎన్నికై, చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్గా కూడా మరల ఏకగ్రీవంగా ఎన్నికై చైర్మన్ పీఠాన్ని అధిరోహించి శైలజ తేజ మూర్తి మహిళా లోకానికి ఆదర్శంగా నిలిచారు. పూతలపట్టు మండల కేంద్రంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే విగ్రహాలకి శైలజ తేజ మూర్తి పూలమాలవేసి ర్యాలీగా వెళ్లారు.

ఈ సందర్భంగా మీడియా సభ్యులతో శైలజ మూర్తి మాట్లాడుతూ విద్యారంగంలో రాణిస్తున్న నన్ను గుర్తించి చిత్తూరు జిల్లా జడ్పీ చైర్మన్గా అవకాశమిచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబుకి ఎల్లప్పుడు రుణపడి ఉంటామని ఆమె తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మరియు చిత్తూరు జిల్లా ఇన్చార్జి మంత్రి మడింపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎంపీ దుగ్గి మల్ల ప్రసాదరావు, పూతల పట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. మహిళలు అనేక రంగాలలో పురుషులతో పాటు సమానంగా హక్కులను అయితేనేమి, ఉన్నత పదవులు నైతేనేమి అలంకరించి సమాజ సేవకు అంకితమవుతున్న మహిళల కథనాలు అనేకం మనం చూస్తుంటాం చదువుతూ ఉంటాం.

మహిళలు చట్ట సభలలో కూడా ప్రవేశించి తమ దైన శైలిలో రాజకీయాలలో మలుపు తిప్పుతూ మహిళల హక్కులతో పాటు మహిళల రక్షణకు కొరకు అనేక సంస్కరణలు చట్టసభలలో ప్రవేశపెట్టి వాటిని అమలుపరిచిన విధానం కూడా మనం చూస్తూ ఉంటాం. ఇదే కోవలో పూతలపట్టు జడ్పిటిసి సభ్యురాలుగా ఏకగ్రీవంగా ఎన్నికై రాజకీయ అరంగేట్రం చేసిన శైలజ తేజ మూర్తి

జిల్లా పరిషత్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టి మహిళల హక్కులతో పాటు మహిళల అభివృద్ధికి ఎంతో కృషి చేసి ఒక మైలు రాయిగా నిలుస్తారని అన్ని వర్గాల ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఉన్నత విద్యను అభ్యసించిన నేను రాజకీయాల్లోకి కొత్తయినా అందరి సహకారంతో జిల్లాలోని సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి రాజకీయాలకు వన్నె తెచ్చే విధంగా నడుచుకుంటామన్నారు.

శైలజ తేజు మూర్తి విద్యా వ్యవస్థలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా అపార అనుభవం గడించిన మహిళగా పేరుపొంది, చిత్తూరు జిల్లాను ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్ది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు ద్వారా ఉత్తమ మహిళ జిల్లా పరిషత్ చైర్మన్ గా అవార్డు తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తామన్నారు.

ఇప్పటికే విజయం విద్యాసంస్థల అధినేత డాక్టర్ తేజ మూర్తి విద్యాసంస్థలలో అగ్రగామిగా నిలిచి చిత్తూరు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ సంస్థ అధ్యక్షులుగా పదవి చేపట్టి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు.

నాకిచ్చిన పదవి బాధ్యతలతో అట్టడుగు వర్గాల సమస్యలు గుర్తించి వారి అభివృద్ధికి అన్ని మౌలిక సదుపాయాలు చేకూర్చిజీవనశైలిలో మార్పు తీసుకొస్తామన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్గా తనకు అవకాశం కల్పించిన జిల్లా తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.

Tags: